వ్యూహం మార్చిన దీదీ.. వారందరికీ నో ఛాన్స్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. తమకు ప్రధాన పోటీదారయిన బీజేపీని నిలువరించేందుకు అన్ని [more]

Update: 2021-03-13 16:30 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. తమకు ప్రధాన పోటీదారయిన బీజేపీని నిలువరించేందుకు అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్నది మమత బెనర్జీ టార్గెట్. ఈ మేరకు మమత బెనర్జీ రాజకీయంగా కలసి వచ్చే అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నారు.

ఎమ్మెల్యేలపై అసంతృప్తి…..

ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎక్కువగా ఉందని మమత బెనర్జీ గుర్తించారు. నిజానికి పశ్చిమ బెంగాల్ లో గత ఐదేళ్లలో మమత బెనర్జీ చెప్పుకోదగ్గ పనులేమీ చేయలేదు. ఎన్నికలకు ముందు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినా అవి ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతాయో తెలీని పరిస్థితి. అందుకోసమే ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి పార్టీ విజయాలపై పడకుండా ఉండేందుకు మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎక్కువమంది వారే….

2016 ఎన్నికల్లో మమత బెనర్జీ 211 స్థానాలను గెలుచుకున్నారు. 294 ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సింహభాగం టీఎంసీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో ఎక్కువ మందిపై ప్రజల్లో అసంతప్తి ఉందని మమత బెనర్జీ గ్రహించారు. అందుకే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని మమత బెనర్జీ నిర్ణయించారు. 30 శాతం సీట్లను యువతకే ఇవ్వాలని మమత బెనర్జీ డిసైడ్ చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం తనకు అత్యంత నమ్మకమైన వారు 12 మందితో స్క్రీనింగ్ కమిటీని కూడా మమత బెనర్జీ ఏర్పాటు చేశారు.

సర్వేల ద్వారానే….?

ఈ స్క్రీనింగ్ కమిటీతో పాటు ప్రశాంత్ కిషోర్ కమిటీ ఇచ్చే నివేదికలను కూడా మమత బెనర్జీ పరిశీలించనునన్నారు. ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. ఈ నియోజకవర్గాల్లో కొత్త వారికే అవకాశమివ్వాలని దీదీ నిర్ణయించారు. 75 ఏళ్లు దాటిన వారికి కూడా ఈసారి టిక్కెట్లు ఇవ్వకూడదని నిశ్చయించారు. కొత్త అభ్యర్థులను సర్వేల ద్వారా ఎంపిక చేయనున్నారు. కొత్త వారయితే కొంత అనుకూలంగా మారుతుందని మమత బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News