దీదీ కి దడ అంటేనే తెలియదట.. అందుకే?

అందుకే మమతను బెంగాల్ టైగర్ అంటారు. దేనికీ దడుపు ఉండదు. వెరపు ఉండదు. తన మీద తనకు అత్యంత విశ్వాసం. అదే ఆమెను గెలుపు గుర్రాలను ఎక్కిస్తుంది. [more]

Update: 2021-01-28 16:30 GMT

అందుకే మమతను బెంగాల్ టైగర్ అంటారు. దేనికీ దడుపు ఉండదు. వెరపు ఉండదు. తన మీద తనకు అత్యంత విశ్వాసం. అదే ఆమెను గెలుపు గుర్రాలను ఎక్కిస్తుంది. పదేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మమత బెనర్జీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మామూలుగా బలమైన అభ్యర్థి ఉన్న చోట ఎవరూ పోటీ చేయడానికి సాహించరు. కానీ మమత బెనర్జీ అందుకు అతీతం.

పదేళ్లుగా అక్కడి నుంచే…..

మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎప్పుడూ ఆమె ఒక స్థానం నుంచే పోటీ చేస్తారు. అయితే ఈసారి మమత బెనర్జీ భవానీపూర్ తో పాటు నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించి ప్రత్యర్థులకు ఒకింత సవాల్ విసిరారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. నిజానికి భావానీపూర్ మమత బెనర్జీకి సేఫ్ ప్లేస్. పదేళ్ల నుంచి అక్కడి నుంచే మమత బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నందిగ్రామ్ లో పోటీ….

నందిగ్రామ్ లో పదేళ్ల నుంచి సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మొన్నటి వరకూ టీఎంసీలో అగ్రనేత. మమత బెనర్జీకి కుడిభుజంలా వ్యవహరించారు. అయితే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోయి ఆయన బీజేపీలో చేరారు. తనను వీడి ప్రత్యర్థి పార్టీలోచేరిన సువేందు అధికారికి మమత బెనర్జీ జర్క్ ఇచ్చేందుకే నందిగ్రామ్ లో పోటీ అని ప్రకటించా రంటున్నారు. సువేందు అధికారికి నందిగ్రామ్ నియోజకవర్గంలో మంచిపట్టుంది.

కట్టడి చేసేందుకేనా?

అయినా పోటీకి దిగుతానని మమతబెనర్జీ ప్రకటించారంటే ఆయనను ఆ ఒక్క నియోజకవర్గానికే కట్టడి చేయాలన్న వ్యూహమేనంటున్నారు. మమత బెనర్జీ పోటీ చేస్తే ఖచ్చితంగా సువేందు అధికారి ఒకింత నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తుంది. మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టే వీలుండదు. అందుకే మమత బెనర్జీ కష్టమైన, క్లిష్టమైన నియోజకవర్గంలో పోటీ చేసేందుకే రెడీ అయ్యారు. ఒకరకంగా ఇది ఇద్దరికీ ప్రతిష్టాత్మకమైనదే కావడంతో ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News