మచ్చిక చేసుకునేందుకు మమత…?

పశ్చిమ బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం సాధించాలని మమత బెనర్జీ ఆరాటపడుతున్నారు. దూసుకు వస్తున్న బీజేపీని నిలువరించేందుకు మమత బెనర్జీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల [more]

Update: 2020-12-30 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం సాధించాలని మమత బెనర్జీ ఆరాటపడుతున్నారు. దూసుకు వస్తున్న బీజేపీని నిలువరించేందుకు మమత బెనర్జీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో మమత పడిపోయారు. ఈసారి మిషన్ 200గా మమత బెనర్జీ ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే అనధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలలని మమత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మిషన్ 200…..

పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 200 స్థానాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో మమత బెనర్జీ ప్రణాళికను రూపొందించుకున్నారు. పట్టున్న ప్రాంతాల్లో మాత్రమే కాకుండా కాంగ్రెస్, వామపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గాలపై మమత బెనర్జీ కన్నేశారు. వారు గెలిచినా అధికారంలోకి రారని, తమను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న నినాదంతో మమత బెనర్జీ ముందుకు వెళుతున్నారు.

మరోసారి సర్వే…..

ఇటీవల పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతల విషయంలోకూడా మమత బెనర్జీ సీరియస్ గానే ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం మమత బెనర్జీ అన్వేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం చేత ఆ నియోజకవర్గాల్లో మరోసారి సర్వే చేయించాలని మమత నిర్ణయించారు. సరైన అభ్యర్థి కోసమే మమత బెనర్జీ మరోసారి సర్వే నిర్వహించాలని ప్రశాంత్ కిషోర్ టీం ను కోరినట్లు తెలుస్తోంది.

వరాల జల్లు…..

మరోవైపు ప్రజలను మచ్చిక చేసుకోవడం కోసం మమత బెనర్జీ వరాల జల్లును కురిపిస్తున్నారు. పన్నెండవ తరగతి విద్యార్థులకు ట్యబ్ లను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్యాబ్ లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల ఖాతాలో పదివేలు జమ చేయాలని నిర్ణయించారు. 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారు. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా మమత బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశఆరు. మొత్తం 16,500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మమత సర్కార్ ప్రకటించింది. జనవరి నెలలోనే వీటిని భర్తీ చేస్తామని పేర్కొంది. పోలీస్ శాఖలో 9 వేల కానిస్టేబుల్ పోస్టులు, వెయ్యివరకూ ఎస్ఐ పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు మమత బెనర్జీ తెలుగును అధికార భాషగా ప్రకటించారు. మొత్తం మీద మమత బెనర్జీ నోటిఫికేషన్ కు ముందే ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News