దీదీకి ధమ్కీ ఇవ్వడం సాధ్యమేనా?

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం ఇప్పుడే [more]

Update: 2020-07-27 17:30 GMT

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం ఇప్పుడే ప్రారంభమయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేత మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తున్నారు. అదే సమయంలో గత కొద్దిరోజులుగా పశ్చిమ బెంగాల్ పై కన్నేసిన భారతీయ జనతా పార్టీ కూడా దూకుడుగా ఉంది.

ఎన్నికలకు సర్వం సిద్ధం…..

ఇప్పటికే మమత బెనర్జీ ఎన్నికలకు సర్వం సిద్ధమయిపోయారు. క్షేత్రస్థాయి పర్యటలను కరోనా కారణంగా చేయకపోయినా వర్చువల్ సమావేశాల ద్వారా కార్యకర్తలకు నిత్యం దిశానిర్దేశం చేస్తున్నారు. మెజారిటీకి అవసరమైన, బలం ఉన్న ముఖ్యమైన నియోజకవర్గాలను గుర్తించిన మమత బెనర్జీ అక్కడ బీజేపీ బలోపేతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని స్థానాల్లో ఇప్పటికే మమత బెనర్జీ అనధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు.

కొన్ని చోట్ల అభ్యర్థులను….

ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన సర్వే నివేదికల ప్రకారం అభ్యర్థులను ఇప్పటికే ఇరవై శాతం మందిని మమత బెనర్జీ ఖరారు చేసినట్లు తెలిసింది. వీరంతా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని మమత బెనర్జీ ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ప్రచారాన్ని కూడా ప్రారంభించాలని కొందరు అభ్యర్థులకు మమత బెనర్జీ సూచించినట్లు చెబుతున్నారు. వచ్చే సారి కూడా తమదే ప్రభుత్వం అన్న ధీమాలో మమత బెనర్జీ ఉన్నారు.

దూకుడు మీద బీజేపీ…..

మరోవైపు బీజేపీ కూడా మమత బెనర్జీకి గట్టి సమాధానమే ఇస్తుంది. ఈసారి మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు. మమత బెనర్జీ తన సమయాన్నంతా బీజేపీని విమర్శించడం కోసమే వెచ్చిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి మాత్రం టైమ్ కేటాయించలేకపోతుందని బీజేపీ ఎదురుదాడికి దిగుతుంది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి మామూలుగా లేదు.

Tags:    

Similar News