అసహనం.. అందుకేనా?

ఏదైనా అసహనం ఉంటేనే ఆగ్రహానికి కారణమవుతుంది. ఓటమి భయం ఉంటేనే ఇతరులపై తప్పులు మోపేందుకు ప్రయత్నిస్తారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ అదే స్పష్టంగా కనపడుతుంది. గతంలో ఎన్నడూ [more]

Update: 2021-04-24 17:30 GMT

ఏదైనా అసహనం ఉంటేనే ఆగ్రహానికి కారణమవుతుంది. ఓటమి భయం ఉంటేనే ఇతరులపై తప్పులు మోపేందుకు ప్రయత్నిస్తారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ అదే స్పష్టంగా కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మమత బెనర్జీ రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గెలుపోటములపై ధీమా ఇప్పటి వరకూ లేదు. ఇంకా పోలింగ్ జరగాల్సిన స్థానాలు ఉన్నాయి. అయినా మమత బెనర్జీ ఎన్నికల కమిషన్ ను టార్గెట్ చేయడం వెనక అసహనమే కారణమంటున్నారు.

చంద్రబాబు కూడా….

గతంలో అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థిితిని చూశాం. 2019 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల కమిషన్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదీపై మండి పడ్డారు. ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లి మరీ ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వచ్చారు. ఇదంతా ఓటమి భయంతోనే అసహనంతో చంద్రబాబు ఆ పనిచేసినట్లు అనిపించింది. ఫలితాలు కూడా తర్వాత చంద్రబాబుకు అనుకూలంగా రాలేదు. ఇప్పుడు మమత బెనర్జీ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లు కన్పిస్తుంది.

నాటి నుంచి….

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అప్పటి నుంచి మమత బెనర్జీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కు మధ్య వార్ ప్రారంభమయింది. సహజంగా సిట్టింగ్ సీఎంలు తమ మాట నెగ్గాలనుకుంటారు. తమ పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవాలనుకుంటారు. కానీ అధికారులందరూ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రావడంతో అది జరగదు. దీంతోనే అసహనం బయటపడుతుందంటారు.

నిత్యం ఈసీ పై…?

మమత బెనర్జీ సయితం ఎన్నికల కమిషన్ తో నిత్యం గొడవ పడుతూనే ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆమె తరచూ ఆరోపిస్తున్నారు. మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్ గా మమత బెనర్జీ ఎద్దేవా చేస్తూ వస్తున్నారు. తనపై దాడి జరిగిందని చెప్పడం, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ దాడి కాదు ప్రమాదమని చెప్పిన నాటి నుంచి స్వరాన్ని మమత బెనర్జీ మరింత పెంచారు. కేవలం ఓటమి భయంతోనే మమత ఎన్నికల కమిషన్ ను బద్నాం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది.

Tags:    

Similar News