మళ్లీ ఆయనకే అవకాశం.. రీజన్స్ ఇవే

శ్రీలంకలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 5న పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణకు ఆ దేశ ఎన్నికల సంఘం సకల ఏర్పాట్లు చేసింది. కోవిడ్ కష్టకాలంలోనుా ఎన్నికలను పకడ్బందీగా [more]

Update: 2020-07-22 16:30 GMT

శ్రీలంకలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 5న పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణకు ఆ దేశ ఎన్నికల సంఘం సకల ఏర్పాట్లు చేసింది. కోవిడ్ కష్టకాలంలోనుా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఓటర్ల మాస్కులు ధరించాలని, భౌతికదుారం పాటించాలని, చేతులు పరిశభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు వాడాలని సూచించింది. వాస్తవానికి ఈ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా రెండుసార్లు వాయిదా వేసింది. మార్చి 2న అధ్యక్షుడు గోటబాయ రాజపక్స పార్లమెంటును రద్దు చేశారు. అప్పటి నుంచి షెడ్యూల్ ప్రకారం 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. తొలుత ఏప్రిల్ 25న ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు. తర్వాత జుాన్ 20 కి వాయిదా పడ్డాయి. చివరికి ఆగస్టు 5న ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల సంఘం (నేషనల్ ఎలక్షన్ కమిషన్) చైర్మన్ మహింద దేశ ప్రియ ప్రకటించారు.

అధ్యక్షుడే కీలకం….

శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రధాని కన్నా అధ్యక్షుడే కీలకం. కార్యనిర్వాహక అధికారాలు ఆయన చేతిలోనే ఉంటాయి. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోటబాయ రాజపక్సే ఘనవిజయం సాధించారు. ఈయన మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడు. రాజపక్స అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గోటబాయ రాజపక్స రక్షణమంత్రిగా ఉన్నారు .2019 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనంతరం గోటబాయ రాజపక్స తన సోదరుడైన మషింద రాజపక్స ను ప్రధానిగా నియమించారు. ఇప్పుడు మహింద మళ్ళీ ఎన్నికల బరిలో నిలిచారు. సోదరుడి గెలుపునకు గోటబాయ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫలితాలు ఆయనకే అనుకాలంగా ఉండవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కలసి వచ్చే అంశాలు…..

తమ్ముడు అధికారంలో ఉండటం ఆయనకు కలసివచ్చే అంశమని అధికార శ్రీలంక పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ భావిస్తోంది. ప్రతిపక్షం చీలిపోవడం కుాడా మహింద రాజపక్స కు కలసి వచ్చే అంశం. ఇంతకు ముందు మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కుాడా మహింద రాజపక్స కు ప్రయెాజనం కలిగించేదే. ప్రధాన ప్రతిపక్షమైన యునైటెడ్ నేషనల్ పార్టీ తరపున మాజీ ప్రధాని రాశిల్ విక్రమ్ సింఘే బరిలో నిలిచారు. ఆయన సీనియర్ నాయకుడు దేశ రాజకీయాలపై గట్టిపట్టు ఉంది. యునైటెడ్ నేషనల్ పార్టీ కి చెందిన సాజిత్ ప్రేమదాస పార్టీని వీడి ‘సామజి జన బాల వాగేయ ‘ పేరుతో కొత్త పార్టీని పెట్టి ప్రధాని అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. ఈయన గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో గోటబాయ రాజపక్స పై పోటీ చేసి ఓడిపోయారు. శ్రీలంక మాజీ ప్రధాని దివంగత రణసింఘె ప్రేమదాస కుమారుడైన సాజిత్ ప్రేమదాసకు ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి. అయితే అది గెలుపునకు దారితీసేంతగా ఉన్నాయా అన్నది అనుమానమే.

మ్యాజిక్ ఫిగర్ 113…..

పార్లమెంట్ లో మెుత్తం 225 స్ధానాలున్నాయి. కనీస మెజారిటీకి 113 స్ధానాలు రావాలి. ప్రస్తుతం 196 స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 29 స్ధానాలను ఆయా పార్టీలు సాధించిన ఓట్లశాతం ఆధారంగా కేటాయిస్తారు. ప్రధాని పదవీ కాలం అయిదేళ్ళు. 2015 లో ప్రధాని పదవికి ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 5 నాటి ఎన్నికల్లో 16.2 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియెాగించుకోనున్నారు. సాధారణంగా ఎన్నికలు ముగిసిన వెంటనే లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ దఫా మరుసటిరోజు ఆగస్టు 6న లెక్కింపు మెుదలు పెడతారు. 1970 తర్వాత ఇలా ఇదే మెుదటిసారి అవుతుంది.

చైనాకు సన్నిహితంగా…..

భారత్ పరంగా చూస్తే శ్రీలంక కీలకమైన ఇరుగు పొరుగు దేశం. దేశ రక్షణ సరిహద్దులు హిదు మహాసముద్రంలోని ద్వీపమే శ్రీలంక. ప్రపంచ చిత్రపటంలో లంక ‘ కొబ్బరికాయ ‘ ఆకృతిలో పోలి ఉంటుంది. భారత్-లంక సంబంధాలు మెుదట్లో బాగానే ఉన్నా మ‍‍హింద రాజపక్స ‍హయంలో దెబ్బతిన్న మాట వాస్తవం. ఆయన హయాంలో అక్కడ చైనా ప్రభావం బాగా పెరిగింది. భారత్ కు వ్యతిరేకంగా పునరుద్ధరణలో భాగంగా గత ఏడాది అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే గోటబాయ రాజపక్స భారత్ ను సందర్శించారు. ప్రస్తుతానికి ఉభయదేశాల సంబంధాలు సాధారణంగా ఉన్నాయి. అభిప్రాయభేధాలు ఉన్నప్పటికీ ఆచితుాచి వ్యవహరిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News