ముందు… ముందు.. ఏమి చూడాల్సి ఉంటుందో?

మహారాష్ట్రను కరోనా వైరస్ ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఒక్క మహారాష్ట్రలోనే లక్ష కేసులకు చేరుకునే రోజు దగ్గరలోనే ఉందని నిపుణులు సయితం హెచ్చరిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా [more]

Update: 2020-06-09 18:29 GMT

మహారాష్ట్రను కరోనా వైరస్ ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఒక్క మహారాష్ట్రలోనే లక్ష కేసులకు చేరుకునే రోజు దగ్గరలోనే ఉందని నిపుణులు సయితం హెచ్చరిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో అత్యధికంగా ఉండటం ఆందోళన కల్గిస్తుంది. మొన్న ఒక్కరోజే 123 మంది కరోనా సోకి మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. దీంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకుంది.

మినహాయింపులు ఇవ్వడంతో…

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు పరుస్తుండటంతో మహారాష్ట్రలోనూ మినహాయింపులు ఇచ్చారు. దీంతో సాధారణ జీవనం ప్రారంభమయింది. రోజుకు రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని ఒక్క ముంబయి నగరంలోనే యాభై వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో కేరళ నుంచి వైద్యులను రప్పించి చికిత్సలను అందించాల్సి వస్తోంది. అయినా కేసులు మాత్రం ఆగడం లేదు.

వలస వచ్చిన వారితోనే….

లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వకపోతే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. దీంతో అన్ని రకాల మినహాయింపులను మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. సినిమా షూటింగ్ లకు సయితం అనుమతి ఇచ్చేసింది. రెస్టారెంట్లు, హోటల్స్ తెరుచుకోవడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారితో కేసుల సంఖ్య ఎక్కువవుతోందని అధికార యంత్రాంగం చెబుతోంది.

ఏం జరిగినా?

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు ఇష్టపడటం లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చింది. వారానికి ఒకరోజు విధిగా విధులకు హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే జీతంలో కోత తప్పదని హెచ్చరించింది. మహారాష్ట్రలో పరిస్థిితిని చూస్తుంటే కరోనా వైరస్ ఇప్పట్లో వదిలిపెట్టేలా కన్పించడం లేదు. దీంతో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే ముందుకు వెళ్లాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో లెక్కకు మించి కేసులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News