“మహా” ముప్పు నుంచి ఎలా తప్పించుకుంటారో?

ఉత్తర్ ప్రదేశ్ తర్వాత అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పుడు మహారాష్ట్ర కరోనా దెబ్బకు కోలుకోలేకపోతోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. [more]

Update: 2020-04-02 18:29 GMT

ఉత్తర్ ప్రదేశ్ తర్వాత అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పుడు మహారాష్ట్ర కరోనా దెబ్బకు కోలుకోలేకపోతోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ప్రధానంగా ముంబయి, నాగపూర్, పూనే తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తన్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిత్యం సమీక్షలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు.

రోజురోజుకూ పెరుగుతున్న….

ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నలభై ఏళ్ల మహిళ కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ మరణించడతో ఉద్ధవ్ థాక్రే ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు తొలుత గుర్తించిన ప్రభుత్వం ఆ వివరాలను సేకరించి వారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది.

లాక్ డౌన్ ను ప్రజలు….

మహారాష్ట్రలో లాక్ డౌన్ కొనసాగుతున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోక పోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని ప్రభుత్వం గుర్తించింది. ఒక్క ముంబయిలోనే 80కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి వచ్చే వారికి భారీగా జరిమానాలను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా శిక్షలు కూడా అమలు చేయాలని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం డిసైడ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేసింది.

కఠిన చర్యలు… ఆంక్షలతో….

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కావడంతో తొలినాళ్లలో కొంత తడబడినా ఇప్పుడు ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా పయనిస్తుంది. ప్రధానంగా వ్యాపార, వాణిజ్య కేంద్రమైన ముంబయి షట్ డౌన్ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయినా ఉద్ధవ్ థాక్రే మాత్రం పేదలు, సామాన్య ప్రజల విషయంలో వెనకాడకుండా నిధులు కేటాయిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పేదలకు ఉచిత భోజన సదుపాయాలను ప్రభుత్వమే కల్పించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగకుండా ఉద్ధవ్ థాక్రే చర్యలు తీసుకుంటున్నారు. మహాారాష్ట్రలో ఇప్పటికే 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

Tags:    

Similar News