ఆయన వస్తారా? వస్తే ఏంటి పరిస్థితి?

మైసూరు మహారాజు రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన మనసులో మాటను వెల్లడించారు. జనం నాడి ఎలా ఉందో తెలుసుకునే [more]

Update: 2020-09-12 18:29 GMT

మైసూరు మహారాజు రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన మనసులో మాటను వెల్లడించారు. జనం నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఆయన చేశారంటున్నారు. మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడియార్ కు తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఆయన పట్టాభిషేకం జరిగిన నాటి నుంచి ఆయన ఎన్నిలకపై ఆసక్తి కనపరుస్తుండటం చర్చనీయాంశమైంది.

ఇప్పటికీ ప్రజాదరణ…..

మైసూరు మహారాజులకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్టటికీ ఒడయార్ కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తారు. అభిమానిస్తారు. వారు చేసిన సేవా కార్యక్రమాలను ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటారు. దసరా ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈసారి కరోనా కారణంగా పెద్దగా జరగకపోతున్నప్పటికీ, మహారాజును చూసేందుకు వేల సంఖ్యలో జనం హాజరవుతుంటారు. వేడుకను చూసి ప్రజలు మురిసిపోతుంటారు.

ఈయనకు ఆసక్తి ఎక్కువ….

ఇప్పటి వరకూ మైసూరు మహారాజులుగా ఉన్న వారు రాజకీయాలపై ఆసక్తి కనపర్చలేదు. కానీ యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ యువకుడు కావడం, ప్రజా సేవ చేయాలన్న తపన ఉండటంతో ఆయన చూపు రాజకీయాల వైపు మళ్లిందంటున్నారు. మహారాజు రాజకీయాల్లోకి రావాలని ఎక్కువ మంది కోరుకున్నా, అదే సంఖ్యలో అభ్యంతరం వ్యక్తం చేసిన వారు లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లడం వేస్ట్ అని మహారాజుకు చెప్పిన వారు కూడా లేకపోలేదు.

బీజేపీ వైపు చూపు…..

అయినా యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ కు రాజకీయాలపై ఆసక్తి తగ్గలేదు. ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. గత లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ ఈయనను పార్టీలోకి తీసుకురావాలని యత్నించింది. అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షా సయితం మహారాజును కలసి ప్రత్యేకంగా చర్చలు జరపడంతో వాదనకు మరింత బలం చేకూరింది. అయితే ఆ ఎన్నికల్లో మహారాజు రాజకీయ ప్రవేశం చేయలేదు. కానీ ఇప్పుడు ఆయనంతట ఆయనే తన మనసులో మాట బయటపెట్టడంతో బీజేపీలోనే చేరతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహారాజు బీజేపీలో చేరితే మైసూరు ప్రాంతంలో బీజేపీకి మరింత పట్టు పెరిగినట్లే.

Tags:    

Similar News