డోన్ట్ కేర్ అంటున్నారే…? ఎందుకిలా?

ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. అయినా సరే ఎమ్మెల్యేలు ఎవరూ డోన్ట్ కేర్ అంటున్నారు. ఆయన ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదట. [more]

Update: 2020-11-09 06:30 GMT

ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. అయినా సరే ఎమ్మెల్యేలు ఎవరూ డోన్ట్ కేర్ అంటున్నారు. ఆయన ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదట. పార్లమెంటు సభ్యుడిగా గెలిచినా పనులు చేయించుకోలేక పోతున్నానన్న ఆవేదన ఆయన సన్నిహితులు వద్ద వ్యక్తం చేస్తున్నారట. ఆయనే ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఆయన వైసీపీలో కంఫర్ట్ గా లేరన్న టాక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విన్పిస్తుంది.

ప్రకాశంలో స్థిరపడి…..

నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట కుటుంబం రాజకీయంగా ప్రకాశం జిల్లాలో స్థిరపడిపోయింది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మాగుంట కుటుంబాన్ని ఆదరించారు. మాగుంట సుబ్బరామిరెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు, ప్రజాసమస్యలపై ఆయన స్పందించిన తీరుతో ఆ కుటుంబానికి ప్రత్యేక అభిమానులు, క్యాడర్ ఏర్పడింది. సుబ్బరామిరెడ్డి మరణం తర్వాత ఆయన సోదరుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి మారారు.

ఆయన వస్తేనే…..

మాగుంట శ్రీనివాసులురెడ్డి నాలుగు సార్లు ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకప్పుడు ఆయన రాకకోసం ఎమ్మెల్యేలు ఎదురు చూసేవారు. ఆయన ఎప్పుడు తమ నియోజకవర్గానికి వస్తారోనని అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూసేవారు. ఆయన తమ నియోజకవర్గానికి వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని భావించేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎమ్మెల్యేలు ఎవరూ కేర్ చేయడం లేదు.

లైట్ తీసుకుంటుండటంతో…..

ఒంగోలు నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలుండగా అందులో ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరంతా ఇప్పుడు మాగుంట అనుచరులను దూరం పెడుతున్నారు. వారికి ఎలాంటి పనులను అప్పగించడం లేదు. మాగుంట సిఫార్సు చేసినా వాటిని లైట్ గా తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో నిధుల కోసం వేచి చూసే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మాత్రం మాగుంట శ్రీనివాసులురెడ్డిని పట్టించుకోవడం లేదు. దీంతో ఆయన నియోజకవర్గ పర్యటనలే మానుకున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News