అందుకోసమేనా యాష్కీ ట్రయల్స్…?

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ పార్టీలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఆయన పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య రాహుల్ గాంధీని [more]

Update: 2021-03-17 09:30 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ పార్టీలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఆయన పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య రాహుల్ గాంధీని కలసి తెలంగాణ రాజకీయాలపై చర్చించడం వెనక కూడా ఇదే కారణమంటున్నారు. మధుయాష్కీ బీసీ వర్గానికి చెందిన నేత. హై ఫై గా ఉంటారు. ప్రజల్లో ఉండేది తక్కువ. కార్యకర్తలను కూడా పట్టించుకోరు. కానీ అధిష్టానం వద్ద మాత్రం గట్టి పట్టు సంపాదించుకున్నారు.

పట్టించుకోక పోవడం వల్లనే…?

మధుయాష్కీ నిజామాబాద్ ను సరిగా పట్టించుకుని ఉంటే పోయిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ విజయం సాధించి ఉండేది అంటున్నారు. మధు యాష్కీ ఇటు నియోజకవర్గాన్ని, అటు క్యాడర్ ను పట్టించుకోకపోవడంతో ఒకసారి టీఆర్ఎస్ కు, మరోసారి బీజేపీకీ అప్పనంగా అప్పజెప్పాల్సి వచ్చిందని పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఇలాంటి నేత పీసీసీ చీఫ్ అయితే పార్టీ ఎదగకపోగా మరింత బలహీనం కాక తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

పార్ట్ టైం పొలిటీషియన్ గానే….

మధుయాష్కీకి ఎప్పటి నుంచో పార్ట్ టైం పొలిటీషియన్ గానే పేరుంది. ఆయన రెండు సార్లు నిజమాబాద్ ఎంపీగా ఉన్నా ఎక్కువ సమయం ఢిల్లీలోనే గడిపారు. ఓటమి తర్వాత దాదాపు ఏడేళ్ల నుంచి నియోజకవర్గం వైపు చూడలేదు. గత ఎన్నికల్లో నిజామాబాద్ ను వదలి భువనగిరి నుంచి పోటీ చేయాలని మధు యాష్కీ భావించారు. అయితే అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉండటంతో సీటు దక్కలేదు.

షర్మిల పార్టీ ప్రభావం…..

మధు యాష్కీ బీసీ వర్గానికే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని హైకమాండ్ వద్ద గట్టిగా పట్టబడుతున్నారు. రెడ్డి సామాజికవర్గానికి పదవులు ఇచ్చినా ప్రయోజనం ఉండదని, వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ కు మధుయాష్కీ వివరించినట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికలలోనూ దగ్గరవ్వదని ఆయన వివరంచారంటున్నారు. అందుకోసమే బీసీలకు పీసీీసీ చీఫ్ ఇవ్వాలని మధుయాష్కీ అధినేతకు వివరించినట్లు తెలిసింది. మొత్తం మీద మధుయాష్కీ పీసీసీ చీఫ్ పదవిపై కన్నేసినట్లే కనపడుతుంది.

Tags:    

Similar News