కలిసినా… గెలుపు ఎవరిది…?

గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో కర్ణాటక రాష్ట్రంలో కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది. అధికారానికి అడుగు దూరంలోనే నిలిచిపోయింది. అసెంబ్లీ [more]

Update: 2019-01-08 18:29 GMT

గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో కర్ణాటక రాష్ట్రంలో కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది. అధికారానికి అడుగు దూరంలోనే నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి 104 సీట్లను సాధించినప్పటికీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పొత్తుతో అది అధికారంలోకి రాగలిగింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ద్విముఖపోటీ నెలకొని ఉండటంతో బీజేపీకి మరింత కష్టమేనా? లేక తాను అనుకున్న రీతిలో సీట్లను సాధించుకోగలుగుతుందా? అన్నదే ప్రశ్నం.

డీలా పడిన క్యాడర్….

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవకాశాన్ని తృటిలో కోల్పోయారు. దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడంతో బీజేపీ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి సంకీర్ణ సర్కార్ తో బీజేపీ నేతలు, క్యాడర్ కొంత అసహనంతో ఉన్నారు. డీలా పడిపోయారు. కేంద్రప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉండటం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాదిన కమలం పార్టీని ఆదుకునే ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే కావడంతో దీనిపైనే ఎక్కువ దృష్టిపెట్టారు.

కలసి పోటీ చేసినా…..

ఒకవైపు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నాయి. ఇంకా సీట్ల పంపకం వరకూ చర్చలు జరగకపోయినప్పటికీ కలసి పోటీ చేసేది ఖాయమని తేలిపోయింది. జేడీఎస్ దాదాపు ఏడు లోక్ సభ స్థానాలను అడుగుతుండగా కాంగ్రెస్ మాత్రం మూడు లేదా నాలుగు లోక్ సభ స్థానాలకే జేడీఎస్ ను కట్టడి చేయాలని చూస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జేడీఎస్, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తాయని చెబుతున్నా సీట్ల వద్దకు వచ్చేసరికి కొంత తగ్గాల్సిందేనని ఆ పార్టీకి సూచిస్తున్నారు. కుమారస్వామి, దేవెగౌడలు పార్టీ విస్తరణకు ఇదే సమయం అని భావించి ఎక్కువ సీట్లను కోరాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం కాబట్టి ఎంపీ సీట్ల విషయంలో తగ్గాల్సిందేనని కాంగ్రెస్ వాదిస్తోంది.

తమకు మేలంటున్న……

ఇలా రెండు పార్టీల మధ్య సయోధ్య కన్పిస్తున్నా…సీట్ల సర్దుబాటుపై ఏంతేలనున్నదోదనన్న ఉత్కంఠ ఇరు పార్టీల్లోనూ ఉంది. ఇక బీజేపీ మాత్రం ఈసారి 20 లోక్ సభ స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా పావులు కదుపుతుంది. మళ్లీ మోదీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అత్యధిక స్థానాలను కర్ణాటక నుంచి గెలుచుకోవాల్సిందేనని కమలనాధులు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీలను మార్చే యోచనలో అధిష్టానం కనపడుతుంది. ద్విముఖ పోటీ తమకు మేలు చేస్తుందని, తటస్థ ఓటర్లు తమవైపు ఉంటరని కమలం విశ్వసిస్తోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు కర్ణాటకలోని ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డాయి.

Tags:    

Similar News