లాక్ డౌన్ ఉంది కానీ… అన్నీ ఓపెన్ చేసేసినట్లే..?

లాక్ డౌన్ ఐదో విడతను ప్రకటించారు. పేరుకే లాక్ డౌన్ కాని దాదాపు అన్నీ ఓపెన్ అయినట్లే. ప్రధానంగా అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధాన్ని ఎత్తివేశారు. ప్రస్తుతం నాలుగో [more]

Update: 2020-05-30 17:30 GMT

లాక్ డౌన్ ఐదో విడతను ప్రకటించారు. పేరుకే లాక్ డౌన్ కాని దాదాపు అన్నీ ఓపెన్ అయినట్లే. ప్రధానంగా అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధాన్ని ఎత్తివేశారు. ప్రస్తుతం నాలుగో విడత లాక్ డౌన్ కొనసాగుతోంది. ఐదో విడత లాక్ డౌన్ రేపటితో పూర్తవుతుంది. కొత్తగా ఐదో విడత లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 30 వ తేదీ వరకూ ఐదో విడత లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా ఉంటుందని ప్రకటించింది.

పూర్తి స్థాయిలో….

అయితే ఐదో విడత లాక్ డౌన్ లో పూర్తి స్థాయిలో మినహాయింపులు ఇచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ ను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 8వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ప్రార్థనామందిరాలు తెరుచుకోవచ్చని పేర్కొంది. జులై నుంచి కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు ప్రారంభించుకోవచ్చని పేర్కొంది. అయితే కంటెయిన్ మెంట్ల జోన్లలో ఎటువంటి మినహాయింపులు ఉండవు.

ఎవరు.. ఎక్కడికైనా…?

ఇక దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ సమయాన్ని కూడా తగ్గించారు. ఇప్పటి వరకూ రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ ఉన్న కర్ఫ్యూను రాత్రి 9గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ తగ్గించారు. ఇక రాష్ట్రాల ప్రయాణాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఏ రాష్ట్రానికైనా సరుకులు కాని, ప్రయాణికులు కానీ పాస్ లు లేకుండా ప్రయాణించవచ్చు. ఇక అంతర్జాతీయ విమానాలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, థియేటర్లు, బార్ అండ్ రెస్టారెంట్స్, ఆడిటోరియాలకు మాత్రం తెరుచుకోవు. రాజకీయ, మతపరమైన సమావేశాలకు మాత్రం అనుమతి లేదు. వీటిని పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు.

ఇన్ని మినహాయింపులు ఇస్తే……

కానీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న దశలో లాక్ డౌన్ మినహాయింపులు ఎక్కువ ఇవ్వడం చర్చనీయాంశమైంది. లక్షాయాభైవేలు దాటిన కేసులు భారత్ ను హడలెత్తిస్తున్నాయి. జూన్, జులై నెలల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశాలున్నాయి. అయినా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐదో విడత లాక్ డౌన్ పూర్తి స్థాయి మినహాయింపులు ఇచ్చారు. మూడో విడత లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు. మరి కేసుల సంఖ్య మరిత పెరిగితే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పై పునరాలోచించే అవకాశమూ లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News