మళ్లీ రెడీ అయిపోయారే?

తమిళనాడులో ఎన్నికల వేడి మొదలయింది. స్థానిక సంస్థల ఎన్నికలు మరో పది రోజుల్లోనే జరగనుండటంతో ఇప్పుడు అన్ని పార్టీలూ ప్రచారంపై దృష్టి పెట్టాయి. స్థానిక సంస్థల్లో పట్టు [more]

Update: 2019-12-18 17:30 GMT

తమిళనాడులో ఎన్నికల వేడి మొదలయింది. స్థానిక సంస్థల ఎన్నికలు మరో పది రోజుల్లోనే జరగనుండటంతో ఇప్పుడు అన్ని పార్టీలూ ప్రచారంపై దృష్టి పెట్టాయి. స్థానిక సంస్థల్లో పట్టు సాధిస్తేనే మరో ఏడాదిన్నరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత అడ్వాంటేజీ ఉంటుంది. స్థానిక సంస్థల్లో జెండా ఎగరగలిగితేనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సులువుగా ఉంటుంది. ఈ నెల 27, 30వ తేదీల్లో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం…..

ఈ ఎన్నికల కోసం ఇప్పటికే అధికార అన్నాడీఎంకే పార్టీ సిద్ధమయింది. పార్లమెంటు ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు వెళుతుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తమిళనాడు గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. నామినేషన్ల పర్వం కూడా పూర్తి కావడంతో అన్ని పార్టీలూ ప్రచారానికి సిద్ధమయ్యాయి. దాదాపు లక్ష వరకూ పదవులు ఈ ఎన్నికల ద్వారా బర్తీ కానున్నాయి. వార్డు మెంబరు, పంచాయతీ మెంబరు నుంచి ఎన్నికలు జరుగుతుండటంతో అన్నాడీఎంకే ,డీఎంకే ప్రత్యేక వ్యూహరచనలతో ముందుకు వెళుతున్నాయి.

స్టాలిన్ ప్రత్యేక వ్యూహంతో….

ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటినా, ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని స్టాలిన్ సీనియర్ నేతలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. మరోవైపు స్థానికసంస్థల ఎన్నికల్లో సమస్యలపై సోషల్ మీడియా ప్రచారం లోనూ ఇప్పటికే డీఎంకే దూసుకు వెళుతోంది. పౌరసత్వ సవరణ చట్ట బిల్లుకు వ్యతిరేకంగా ఇటీవల ఆందోళన చేసిన అంశాన్ని హైలెట్ చేస్తుంది.

పళనిస్వామి……

డీఎంకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను కూడా వినియోగించుకుంటోంది. తన కుమారుడి ఉదయనిధి రాజకీయ భవిష్యత్ కోసమే స్టాలిన్ పీకేతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పీకే టీం రంగంలో కి దిగింది. ఇక ఉదయనిధిని కూడా ఎన్నికల ప్రచారంలో దించనున్నారు. అన్నాడీఎంకే మాత్రం పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు దగ్గరుండి స్థానిక సంస్థ అభ్యర్థుల ను ఎంపిక చేశారు. మొత్తం మీద తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

Tags:    

Similar News