వస్తే ఆటాడేసుకుందామనేనా?

ఆంధ్రప్రదేశ్ లో రానున్న కొత్త గవర్నర్ కీలకం కానున్నారా? ఆయన పార్టీ బలోపేతానికి వస్తున్నట్లు స్థానిక నేతలు భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ [more]

Update: 2019-07-21 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రానున్న కొత్త గవర్నర్ కీలకం కానున్నారా? ఆయన పార్టీ బలోపేతానికి వస్తున్నట్లు స్థానిక నేతలు భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ వారంలోనే గవర్నర్ గా బాధ్యతలను తీసుకోబోతున్నారు. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ కీలకంగా మారనున్నారు. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండటంతో గవర్నర్ నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

అధికార పార్టీకి ఇబ్బంది లేకున్నా….

ఇటీవలే అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నెంబర్ పరంగా పెద్దగా ఇబ్బందులు లేవు. అంటే ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి ఎటువంటి ఢోకాలేదు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి గవర్నర్ సహకారం అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల పడుతున్న రాష్ట్రానికి గవర్నర్ సాయంతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే వీలుంటుంది. అలాగే కొన్ని ప్రధానమైన వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే వివిధ సమస్యలపై ఆయన స్పందించే అవకాశమూ ఉంది.

బీజేపీ ఆశలివే…..

అందుకే గవర్నర్ తో అధికారపక్షం సహజంగానే సఖ్యతగా ఉంటుంది. బిశ్వభూషణ్ హరించందన్ ఫక్తు భారతీయ జనతా పార్టీ నేత కావడంతో ఆయనపై స్థానిక బీజేపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. జగన్ పాలన పోలీసు రాజ్యంలా మారిందని ఆరోపించారు. ఈనేపథ్యంలో గవర్నర్ సాయంతో బీజేపీ నేతలు కొంత శాంతి భద్రతల సమస్యపై దృష్టిపెట్టేవీలుందని చెబుతున్నారు.

టీడీపీ కూడా….

నిజానికి గవర్నర్ ఏ విషయంలోనైనా సంబంధిత శాఖ అధికారులతో సమాచారం తెప్పించుకోవచ్చు. అలాగే అధికార పార్టీని చికాకు పెట్టాలన్న పెట్టే వీలుంది. మరోవైపు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలోనూ గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఒడిశా వెళ్లి మరీ కలసి ప్రభుత్వం, పార్టీ తరుపున అభినందనలు తెలిపి వచ్చారు. గవర్నర్ పదవీ స్వీకారం చేసిన తర్వాత ఒక ఆటాడుకోవచ్చని బీజేపీ నేతలు కాచుకుని కూర్చుని ఉన్నారు. ఇలా మొత్తం మీద గవర్నర్ రాక కోసం ప్రధానంగా బీజేపీ, టీడీపీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

Tags:    

Similar News