అసెంబ్లీకి ప‌నికిరానోడు.. పార్లమెంటుకు ప‌నికొచ్చాడే

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. ఏమ‌నుకుంటారు ? ఆయ‌న వ్యూహం ఎలా ఉంటుంద‌ని భావిస్తారు ? ఆయ‌న‌కు ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది క‌నుక‌.. ఆయ‌నకు [more]

Update: 2020-10-16 08:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. ఏమ‌నుకుంటారు ? ఆయ‌న వ్యూహం ఎలా ఉంటుంద‌ని భావిస్తారు ? ఆయ‌న‌కు ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది క‌నుక‌.. ఆయ‌నకు తిరుగులేద‌ని, ఆయ‌న వ్యూహానికి ప‌దును ఎక్కువ‌ని అనుకుంటారుఎవ‌రైనా.. కానీ, తాజాగా పార్టీ పార్లమెంట‌రీ జిల్లా ఇంచార్జుల నియామ‌కంతో ఇదంత కూడా ఒట్టిదేన‌ని తేలిపోయింది. అస‌లు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్‌గా ప‌నికిరాడ‌ని తేల్చేసిన ఓ నాయ‌కుడిని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను డీల్ చేయాల్సిన పార్లమెంట‌రీ జిల్లాకు ఎలా ఇంచార్జ్‌గా నియ‌మిస్తారో చంద్రబాబుకే తెలియాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అందరికీ విస్మయం……

దీనికి కార‌ణం.. చంద్రబాబు చేసిన నియామ‌కాల నిర్వాకంలో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిని ఇక్కడ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ప‌నికిరాడ‌ని భావించి.. ప‌క్కకు త‌ప్పించారు. వాస్తవానికి ఈ జిల్లాపై ప‌ట్టుకోసం ప్రయ‌త్నిస్తున్న చంద్రబాబుకు ఎప్పటిక‌ప్పుడు ఎదురు దెబ్బలు త‌గులుతూనే ఉన్నాయి. 2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో ఒక్క సీటుతో స‌రిపెట్టుకున్న టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో డ‌క్ అవుట్ అయ్యింది. ఇక ప్రొద్దుటూరులో గ‌త ఎన్నికల్లో ఓడిన లింగారెడ్డిపై వ‌చ్చిన వ్యతిరేక‌త‌తో వెంట‌నే ప‌క్కన పెట్టి ఉక్కు ప్రవీణ్‌కు బాధ్యత‌లు అప్పగించారు. అయితే, తాజాగా జ‌రిగిన పార్లమెంటు కూర్పులో లింగారెడ్డికి క‌డ‌ప ఇంచార్జ్‌గా బాధ్యత‌లు అప్పగించారు. ఇది అంద‌రినీ విస్మయానికి గురిచేస్తోంది.

సీటు ఇవ్వకుండా…..

వాస్తవానికి 2009లో లింగారెడ్డి ప్రొద్దుటూరు నుంచి విజయం సాధించినా.. అది ఆయ‌న బ‌లం కాద‌ని, అప్పటికే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ‌ర‌ద‌రాజుల రెడ్డిపై ఉన్న వ్యతిరేక‌త‌లో లింగారెడ్డి గెలుపు గుర్రం ఎక్కార‌న్న టాక్ ఉంది. అలాంటి నేత‌కు 2014 ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వలేదు.. మ‌ళ్లీ మొన్న ఎన్నికల్లో చంద్రబాబు లింగారెడ్డికే సీటు ఇవ్వగా ఆయ‌న ఓడిపోయారు. దీనిని బ‌ట్టి లింగారెడ్డి విష‌యంలో బాబు పిల్లిమొగ్గలు మామూలుగా లేవు. 2009లో గెలిచిన ఆయ‌న ప‌నికి రాడ‌ని 2014లో సీటు ఇవ్వలేదు.. మ‌ళ్లీ మొన్న ఎన్నికల్లో ఆయ‌న‌కే సీటు ఇచ్చారు.

కీలకమైన జిల్లాకు….

ఎన్నిక‌ల్లో ఓడాక ఆయ‌నపై ఇక్కడ పెల్లుబికిన అసంతృప్తి నేప‌థ్యంలోనే మార్చేశారు. కానీ, ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన క‌డ‌ప పార్లమెంట‌రీ జిల్లా ప‌గ్గాల‌ను లింగారెడ్డికి అప్పగించారు. దీనివ‌ల్ల ఒరిగేది ఏంటి ? అనేది సీనియ‌ర్ల మాట‌. నిజ‌మే.. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆప‌సోపాలు ప‌డ్డ నేత‌ను తీసుకువెళ్లి.. పార్లమెంట‌రీ జిల్లా నేత‌గా నియ‌మించ‌డం అంటే.. ఇంత‌క‌న్నా దారుణం ఉండ‌ద‌ని అంటున్నారు.ఈ క్రమంలోనే క‌డ‌ప‌లో బాధ్యత‌లు చేప‌ట్టేందుకుఎవ‌రూ ముందుకు రాని నేప‌థ్యంలోనే గ‌తిలేని ప‌రిస్థితిలోనే లింగారెడ్డిని ఇక్కడ నియ‌మించారని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News