ఈ నేతను జగన్ దూరం పెట్టడానికి కారణం ఇదేనా?

వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన లేళ్ల అప్పిరెడ్డిని జగన్ దూరం పెట్టారా? ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి కారణాలేంటి? అన్న చర్చ జరుగుతుంది. లేళ్ల అప్పిరెడ్డి వైఎస్ [more]

Update: 2021-04-20 03:30 GMT

వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన లేళ్ల అప్పిరెడ్డిని జగన్ దూరం పెట్టారా? ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి కారణాలేంటి? అన్న చర్చ జరుగుతుంది. లేళ్ల అప్పిరెడ్డి వైఎస్ హయాం నుంచి యాక్టివ్ గా ఉన్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ ను చేశారు. వైఎస్ అనంతరం ఆయన తనయుడు జగన్ వెంట లేళ్ల అప్పిరెడ్డి నడిచారు. గుంటూరు జిల్లాలో కీలక నేతగా, నమ్మకమైన నేతగా ఉన్నారు.

రెండేళ్లవుతున్నా…..

అయితే రెండేళ్లవుతున్నా లేళ్ల అప్పిరెడ్డిని జగన్ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు పశ్చిమ నియజకవర్గం టిక్కెట్ ఆశించారు. అయితే అప్పట్లో సామాజిక సమీకరణాల ఆధారంగా లేళ్ల అప్పిరెడ్డికి జగన్ టిక్కెట్ ఇవ్వలేకపోయారు. ఏసురత్నానికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో లేళ్ల అనుచరులు యాగీ యాగీ చేశారు. దీంతో జగన్ పార్టీ అధికారంలోకి రాగానే లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పటీకీ సన్నిహితంగానే…..

లేళ్ల అప్పిరెడ్డి ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో రెగ్యులర్ గా ఉంటున్నారు. జగన్ కు సన్నిహితంగానే మెలుగుతున్నారు. గుంటూరు సిటీలో తీసుకునే నిర్ణయాలు ఆయన కనుసన్నల్లోనే జరగుతున్నాయంటున్నారు. అయినా సరే పదవులు విషయానికి వచ్చే సరికి లేళ్ల అప్పిరెడ్డిని జగన్ పక్కన పెడుతున్నారు. ఇటీవల ఆరు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసినా అందులో ఆయన పేరు లేకపోవడంతో మరోసారి అసంతృప్తికి గురయ్యారంటున్నారు.

భవిష‌్యత్ లోనైనా….?

అయితే భవిష‌్యత్ లో వచ్చే పదవులన్నీ వైసీపీకే దక్కనున్నాయి. ఈ సారి ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ జాబితాలో లేళ్ల అప్పిరెడ్డి పేరు ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గం కావడం వల్లనే జగన్ ఆయనను పక్కన పెడుతున్నారని, సరైన సమయం చూసుకుని పదవి ఇస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద ఎనిమిదేళ్లుగా పార్టీ వెంటే ఉంటున్న లేళ్ల అప్పిరెడ్డికి ఏ పదవీ దక్కకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News