ap left parties : దారి దొరకడం లేదా?

ప్రజాసమస్యలు ఎక్కడుంటే వామపక్షాలు అక్కడ ఉంటాయి. ప్రజల వెంట నిరంతరం పయనిస్తుంటాయి. అదే ఆ పార్టీలకు ప్లస్ పాయింట్. బలమైన క్యాడర్ ఉన్న వామపక్ష పార్టీలు ఇప్పుడు [more]

Update: 2021-09-22 11:00 GMT

ప్రజాసమస్యలు ఎక్కడుంటే వామపక్షాలు అక్కడ ఉంటాయి. ప్రజల వెంట నిరంతరం పయనిస్తుంటాయి. అదే ఆ పార్టీలకు ప్లస్ పాయింట్. బలమైన క్యాడర్ ఉన్న వామపక్ష పార్టీలు ఇప్పుడు ఏపీలో క్రాస్ రోడ్స్ లో ఉన్నాయి. ఎటూ వెళ్లలేని పరిస్థితిని కొని తెచ్చుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఆ పార్టీలు ఏనాడో కోల్పోయాయి. దీంతో వచ్చే ఎన్నికలకు ఎవరితో కలసి నడుద్దామనుకున్నా వారికి దారి దొరకడం లేదు.

దశాబ్దకాలం క్రితం వరకూ…

వామపక్ష పార్టీలు దశాబ్దకాలం క్రితం వరకూ కొంత రాజకీయాలను శాసించాయి. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీపీఐ, సీపీఎంలు మరింత క్షీణించాయి. తమకు పట్టున్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సయితం ఇప్పుడు ప్రభావం చూపే అవకాశం కన్పించడం లేదు. వామపక్ష భావాజాలాన్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో చాలా తక్కువయింది. ఉన్న క్యాడర్ కూడా తమ బతుకు పోరాటం కోసం ఇతర పార్టీలను ఆశ్రయిస్తున్నాయి.

ఎవరితో పొత్తుకు?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో వామపక్షాలు జనసేనతో కలసి నడిచాయి. ఒక్క సీటును కూడా సాధించుకోలేకపోయాయి. రెండు ఎన్నికల్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని దక్కించుకోలేకపోయాయి. బీజేపీతో ఆ పార్టీ కలసి నడవదు. చంద్రబాబుతో ప్రయాణం కొనసాగించే అవకాశాలు కొట్టిపారేయలేం. కానీ చంద్రబాబు బీజేపీతో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కాదన్నా జనసేనతోనయినా ప్రయాణించాలన్న అభిప్రాయంతో ఉన్నారు.

కాంగ్రెస్ తో కలసి….

ఈ పరిస్థితుల్లో చంద్రబాబును నమ్మి వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేవు. ఇక అధికారంలో ఉన్న వైసీపీ వెంట కూడా నడిచే అవకాశం లేదు. దీంతో వామపక్ష పార్టీలకు ఒకే దారి ఉంది. అది కాంగ్రెస్ తో కలసి నడవటమే. ఏపీలో కాంగ్రెస్ తో ఏ పార్టీ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఇక వామపక్షాలయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాయి. మొత్తం మీద ఏపీలో వామపక్ష పార్టీలకు దారి కన్పించడం లేదు.

Tags:    

Similar News