నీ రాక కోసం…!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారం రోజుల తర్వాత అమరావతికి రానున్నారు. ఆయన ఏపీకి వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అనేక [more]

Update: 2019-08-24 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారం రోజుల తర్వాత అమరావతికి రానున్నారు. ఆయన ఏపీకి వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అనేక అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. జగన్ వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో లేరు. ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లారు. కేవలం వారం రోజులు పర్యటనే అయినప్పటికీ ఎన్నో సంఘటలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైనది రాజధాని అమరావతి.

అమరావతిపై…..

రాజధాని అమరావతిలో ఉంటుందా? లేదా? దానిని మార్చే అవకాశం ఉంటుందా? అన్నది ఏపీలో హాట్ టాపిక్. దీనికి ప్రధాన కారణం మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన మాత్రమే. దీనిపై పెద్దయెత్తున ప్రజల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నేతలు, ప్రజల్లో మాత్రం ఇంకా టెన్షన్ నెలకొని ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ మంత్రి మాత్రమే కాకుండా సీఆర్డీఏను కూడా చూస్తుండంతో ఆయన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

బొత్స ప్రకటనతో….

మంత్రి బొత్స సత్యనారాయణను రాజధాని అమరావతిని మారుస్తామని చెప్పలేదు. అయితే ప్రభుత్వంలో దీనిపై చర్చ జరుగుతుందని, త్వరలోనే నిర్ణయం ఉంటుందని మాత్రమే చెప్పారు. బొత్స ప్రకటనకు అనేక మంత్రులు మద్దతు పలికారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మాత్రం అమరావతిని తరలించే ప్రసక్తి లేదని చెప్పారు. ఇలా వైసీపీ నేతల్లోనే రాజధాని విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొని ఉండటం గమనార్హం. రాజధానిని తరలిస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే దీనిపై వైసీపీ నేతల్లోనూ కంగారు కన్పిస్తోంది.

నవయుగ అంశాన్ని…..

ఇక అమరావతి రాజధానిని విషయంతో పాటు నవయుగ అంశంపై కూడా వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురయింది. నవయుగను తప్పించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. స్టే ఇచ్చింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయంపై ఇటు అధికారులు, అటు మంత్రులు జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో జగన్ రాకతో క్లారిటీ వస్తుందని ఇటు మంత్రులతో పాటు అటు విపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. మరి జగన్ దీనిపై స్పష్టత ఇస్తారో? లేదో? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News