janasena : జనసేనను బీజేపీ ఆపగలదా?

ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ కళ్ల ముందు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయన్నది వాస్తవం. ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే [more]

Update: 2021-11-04 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ కళ్ల ముందు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయన్నది వాస్తవం. ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం బీజేపీ తో పొత్తుతో జనసేన ఉంది. ఆ పొత్తును కాదనుకుని జనసేన బయటకు రావాల్సి ఉంటుంది. అలా కాకున్నా బీజేపీని తనతో కలుపుకుని టీడీపీతో కలసి ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఈ రెండు జరిగే పనేనా? అన్నది రెండు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.

రెండు పార్టీలూ కలసి…

జనసేన, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో కూడా కలసి పోటీ చేస్తాయని రెండు పార్టీల నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ జనసేన అధినేత చూపు టీడీపీ పై ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన ఒక నేత రెండు పార్టీల మధ్య పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు గ్యారంటీ అని ఇరు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. కానీ బీజేపీది మాత్రం డౌట్ కొడుతుంది. టీడీపీతో కలసి ప్రయాణం చేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు.

టీడీపీతో నో ఛాన్స్….

తాము చంద్రబాబు చేతిలో పలుమార్లు మోసపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీతో కలసి ప్రయాణించడం జరగని పని అని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అలాగని జనసేనను కూడా వదులుకోబోమని కూడా వారు అంటున్నారు. అంటే జనసేన బీజేపీని వదిలిపెట్టడం అంత సులువు కాదు. పవన్ కల్యాణ్ తనంతట తాను వెళ్లిపోయే అవకాశం కూడా లేదని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.

పవన్ తో నేరుగా….

తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీ కలసి రాకపోయినా జనసేన వస్తే చాలని భావిస్తుంది. జనసేన, కమ్యునిస్టు పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్లవచ్చన్నది టీడీపీ ఉద్దేశ్యం. కానీ పవన్ కల్యాణ‌్ ను బీజేపీ పొత్తు నుంచి బయటకు పోకుండా ఉండేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత నేరుగా మోదీ, అమిత్ షాల నుంచి పవన్ కల్యాణ్ కు పిలుపు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద జనసేన టీడీపీ ట్రాప్ లో పడకుండా బీజేపీ అన్ని చర్యలను ప్రారంభించింది.

Tags:    

Similar News