నమ్మకం కోల్పోతున్నారా? దెబ్బ మామూలుగా లేదు

దేశ మంతటా నేతలు బీజేపీ వైపు చూస్తుంటే అక్కడ మాత్రం బీజేపీకి ఝలక్ ఇచ్చారు. నాయకత్వంపై తమకు నమ్మకం లేదంటూ ఎదురు తిరిగారు. దీంతో అధికారంలో ఉన్న [more]

Update: 2020-06-21 17:30 GMT

దేశ మంతటా నేతలు బీజేపీ వైపు చూస్తుంటే అక్కడ మాత్రం బీజేపీకి ఝలక్ ఇచ్చారు. నాయకత్వంపై తమకు నమ్మకం లేదంటూ ఎదురు తిరిగారు. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఇప్పుడు అధికారంలోకి దిగిరాక తప్పని పరిస్థితి. మణిపూర్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇక్కడ బీజేపీకి ఇప్పటి వరకూ మద్దతిస్తున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో మణిపూర్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

గత ఎన్నికల్లో…..

2017లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అప్పటి వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే మణిపూర్ లో ఉన్న 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేవలం 21 స్థానాలను మాత్రమే సాధించింది. మ్యాజిక్ ఫిగర్ర 30 గా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలను గెలుచుకుంది. అయితే అప్పట్లో నాగా పీపుల్స్ ఫ‌్రంట్ నుంచి నలుగురు, టీఎంసీ, లోక్ జనశక్తి పార్టీ నుంచి ఒక్కొక్కరు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తొమ్మిది మంది బయటకు రావడంతో…

అయితే ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది సభ్యులు బీజేపీలో చేరిపోయారు. బీజేపీ బలం పెరిగింది. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులందరూ తిరిగి సొంత గూటికి చేరుకుంటే కాంగ్రెస్ మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. మద్దతు ఉపసంహరించుకున్న వారిలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఉండటం విశేషం.

ప్రభుత్వం ఏర్పాటు జరిగేనా?

దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కూడా కాంగ్రెస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓక్రామ్ ఇబోబి సింగ్ కాంగ్రెస్ ప్రకటించింది. మరి గవర్నర్ ఫ్టోర్ టెస్ట్ కు అనుమతి ఇస్తే ఏంజరుగుతుందనేది చూడాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనంతో బీజీపీ వైపు నేతలు చూస్తుంటే మణిపూర్ లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.

Tags:    

Similar News