రాజధానిలో భూములు కొంది వీరే

రాజధాని అమరావతిలో పెద్ద యెత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. రాజధాని అంశంపై ఆయన మాట్లాడుతూ పెద్దయెత్తున [more]

Update: 2019-12-17 11:34 GMT

రాజధాని అమరావతిలో పెద్ద యెత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. రాజధాని అంశంపై ఆయన మాట్లాడుతూ పెద్దయెత్తున రాజధానిలో అవినీతి జరిగిందన్నారు. జూన్ 1 2014 నుంచి ఇప్పటి వరకూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువులు, సన్నిహితులు పెద్దయెత్తున భూములు కొనుగోలు చేశారన్నారు. నూజివీడు అని పక్కదోవ పట్టించి ఇక్కడి భూముల ధరలను తగ్గించి టీడీపీ నేతలు పెద్దయెత్తున కొనుగోలు చేశారన్నారు. బాలకృష్ణ వియ్యంకుడికి 499 ఎకరాలను ఎకరం భూమి లక్ష రూపాయలకే ఇచ్చారన్నారు. రాజధాని ప్రాంతం ఇక్కడ రాబోతుందని ముందుగానే లీకులు ఇవ్వడంతో తమకు అనుకూలురైన వారిని భూములు కొనుగోలు చేసేలా చేశారన్నారు. దళితులను బెదిరించి వారి అసైన్డ్ భూములను కొనుగోలు చేశారన్నారు. ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేతలు 4,వేల ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించిందన్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ – 14. 22 ఎకరాలు
పొంగూరి నారాయణ,
రాపూరి సాంబశివరావు
ప్రత్తిపాటి పుల్లారావు – 32.ఎకరాలు
పరిటాల సునీత
రావెల కిషోర్ బాబు
మైత్రి ఇన్ ఫ్రా
కొమ్మాలపాటి శ్రీధర్
జీవీ ఆంజనేయులు
పయ్యావుల కేశవ్
వేం నరేందర్ రెడ్డి
పల్లె రఘునాధరెడ్డి
వేమూరి రవికుమార్ (లోకేష్ పార్టనర్)
లింగమనేని రమేష్ – 351 ఎకారలు
యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ – 25 ఎకరాలు
దూళిపాళ్ల నరేంద్ర – పది ఎకరాలు
కోడెల శివప్రసాదరావు – 5 ఎకరాలు
కొల్లి శివరాం
గుమ్మడి సురేష్,
నిమ్మగడ్డ శాంతకుమారి,
కాశిరెడ్డి పేరయ్య,
దూళిపాల్ల సుజన
యాగంటి శ్రీకాంత్

Tags:    

Similar News