కోరి మరీ తెచ్చుకున్నట్లున్నారుగా?

తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికినే ఉండదట. ఇది ఖచ్చితంగా లాలూ ప్రసాద్ విషయంలో నిజమయింది. మరికొద్ది రోజుల్లో జైలు నుంచి బెయిల్ పై లాలూ ప్రసాద్ [more]

Update: 2020-12-02 16:30 GMT

తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికినే ఉండదట. ఇది ఖచ్చితంగా లాలూ ప్రసాద్ విషయంలో నిజమయింది. మరికొద్ది రోజుల్లో జైలు నుంచి బెయిల్ పై లాలూ ప్రసాద్ యాదవ్ బయటకు వస్తారనుకుంటే చేజేతులా మరో కేసులో చిక్కుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ ఎమ్మెల్యేకు చేసిన ఫోన్ వివాదమయింది. దీనిపై జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.

ఆర్జేడీ వస్తుందని అంచనాతో…..

లాలూ ప్రసాద్ యాదవ్ సీనియర్ నేత. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా ఆర్జేడీ అధికారంలోకి వస్తుందని లాలూ ప్రసాద్ యాదవ్ అంచనా వేసుకున్నారు. తనను అక్రమంగా జైలులో పెట్టారని సానుభూతి కురుస్తుందనుకున్నారు. నిజమే లాలూ ప్రసాద్ యాదవ్ పుణ్యమా అని ఆర్జేడీకి అన్ని సీట్లు వచ్చాయన్నది ఒక లెక్క. మరోవైపు తేజస్వి యాదవ్ కృషి కూడా అత్యధిక స్థానాలను సాధించడానికి కారణమనే వారు లేకపోలేదు. ఈ వాదన ఎలా ఉన్నా అధికారానికి కొద్ది దూరంలో ఆర్జేడీ ఆగిపోయింది.

నితీష్ ను చేయడంతో….

బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినా తనకు ఒకప్పటి మిత్రుడు, ఇప్పుడు శత్రువు అయిన నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేయడం లాలూ ప్రసాద్ యాదవ్ కు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఆయన ఆర్జేడీ ప్రభుత్వాన్ని బీహార్ లో చూడాలనుకున్నారు. స్పీకర్ ఎన్నిక సందర్బంగా ఎన్డీఏ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఓటింగ్ కు దూరంగా ఉండమని కోరారు. స్పీకర్ ఆర్జేడీ వారయితే భవిష్యత్ లో అధికారంలోకి రావడానికి సులువవుతుందని లాలూ ప్రసాద్ యాదవ్ అంచనా వేశారు.

ఫోన్ వివాదం…..

కానీ లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ చేతికి ఫోన్ ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆడియో టేపుల్లో నిజమెంత అని తేల్చే పనిలో పడ్డారు అధికారులు. కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ఈ కేసులో లాలూకు చిక్కులు తప్పవంటున్నారు. బెయిల్ పై వస్తారనుకుంటున్న దశలో లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వివాదంలో చిక్కుకోవడం ఆయన స్వయంకృతాపరాధమే.

Tags:    

Similar News