ఆశలన్నీ కొట్టుకుపోయినట్లేనా?

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరికొంత కాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఆర్జేడీ [more]

Update: 2020-11-13 17:30 GMT

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరికొంత కాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఆర్జేడీ అధినేతగా లాలూ ప్రసాద్ యాదవ్ పై అనేక కేసులున్నాయి. పశుగ్రాసం కుంభకోణంతో పాటు డుమ్కా ట్రెజరీ కుంభకోణం కేసులో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ నిందితులుగా ఉన్నారు. దీంతో ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

పశుగ్రాసం కుంభకోణం కేసులో….

అయితే పశుగ్రాసం కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించింది. డుమ్కా ట్రెజరీ కేసులోనూ లాలూ యాదవ్ కు బెయిల్ లభిస్తుందని ఆర్జేడీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల నాటికి జైలు నుంచి విడుదల అవుతారని లాలూప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు కూడా భావించారు. అయితే ఈ కేసును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

మూడేళ్ల నుంచి…..

లాలూ ప్రసాద్ యాదవ్ మూడేళ్ల నుంచి జైలులోనే ఉన్నారు. 1990లో బీహార్ లో పశుగ్రాసం కుంభకోణం జరిగింది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే 2017లో శిక్ష పడటంతో లాలూ ప్రసాద్ యాదవ్ అప్పటి నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అయితే ఆయనకు పశుగ్రాసం కుంభకోణంలో బెయిల్ అభించడంతో కుటుంబంతో పాటు ఆర్జేడీ క్యాడర్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.

బెయిల్ దొరకకపోవడంతో…..

కానీ ఇప్పుడు డుమ్కా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించలేదు. ఆయన మరికొంతకాలం జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాలూ ప్రసాద్ యాదవ్ పై కక్ష సాధింపుతోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగిందని బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ప్రధాన ప్రచారంగా వాడుకుంది. లాలూ యాదవ్ కు బెయిల్ లభించకపోవడంతో ఆర్జేడీ వర్గాలు పూర్తి నిరాశలో మునిగిపోయాయి. మరి లాలూకు జైలు నుంచి మోక్షమెప్పుడో చూడాలి మరి.

Tags:    

Similar News