వర్మ టీజర్ వైరల్ !!

సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ కొద్ది కొద్దిగా సినిమా చూపిస్తూ సస్పెన్స్ రేకెత్తిస్తున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ టాలీవుడ్ [more]

Update: 2019-02-15 02:17 GMT

సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ కొద్ది కొద్దిగా సినిమా చూపిస్తూ సస్పెన్స్ రేకెత్తిస్తున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ఆయన విడుదల చేస్తూ వస్తున్న టీజర్స్ వర్మ ప్రధాన ఉద్దేశ్యం చెప్పకనే చెబుతున్నాయి. సినిమా రిలీజ్ ను టిడిపి అడ్డుకుంటుందన్న అనుమానంతో వర్గ్మ విడుదల చేస్తున్న టీజర్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్. తాజాగా ఆర్జీవీ విడుదల చేసిన టీజర్ అటు టిడిపి శ్రేణుల్లోనూ ఇటు నందమూరి కుటుంబంలో ఆందోళన పెంచుతుంది.

లక్ష్మీపార్వతి ఎంట్రీ నుంచి …

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయినప్పటినుచి ఈ ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. వర్మ టీజర్స్ సినిమాలో ప్రధాన ఇతివృత్తం ఎలా వుండబోతుందో చెప్పక చెబుతుంది.దానివల్లే తెలుగు తమ్ముళ్లు కలత చెందుతున్నారు. ఇప్పటికే పిఠాపురం ఎమ్యెల్యే వర్మ దీనిపై మరికొందరు తో కలిసి కోర్ట్ మెట్లు ఎక్కారు. ఈ కేసుకాకుండా నందమూరి కుటుంబం తమ వ్యక్తిగత జీవితాలు ప్రభావితం అయ్యేలా వర్మ సినిమా తీస్తున్న విషయాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది.

చెప్పులు విసిరిన తమ్ముళ్ళు …

వర్మ విడుదల చేసిన టీజర్ లో ఎన్టీఆర్ చివరి రోజుల అవమానాలను అత్యంత సహజసిద్ధంగా చిత్రీకరించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మిపార్వతి జీవిత చరిత్ర రాసేందుకు వచ్చి ఎన్టీఆర్ కు ఎలా దగ్గర అయ్యారు. ఎన్టీఆర్ కుటుంబంలోని కొందరు దీనిని ఎలా వ్యతిరేకించారు.? వైశ్రాయి హోటల్ సాక్షిగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ కు చెప్పులు తో కొట్టిన సన్నివేశాలను ఇప్పుడు అందరి లో ఆసక్తికర చర్చ మొదలు అయ్యేలా చేసింది. మరి ఫైనల్ రిజల్ట్స్ మాత్రం ఈ చిత్రంపై ప్రజలే తీర్పును ఇవ్వనున్నారు. అదెలా వుంటుందో చూడాలి.

Tags:    

Similar News