అత్త పట్టిన శపధం అల్లుడికి గ్రహణమేనా?

సాధారణంగా అల్లుడు పట్టిన భరతం అంటే పక్కా మాస్ ఎలిమెంట్ అని చెప్పాలి. ఆ కంటెంటే వేరుగా ఉంటుంది. మన తెలుగు సినిమాలు అన్నీ కూడా అల్లుడు [more]

Update: 2020-10-17 00:30 GMT

సాధారణంగా అల్లుడు పట్టిన భరతం అంటే పక్కా మాస్ ఎలిమెంట్ అని చెప్పాలి. ఆ కంటెంటే వేరుగా ఉంటుంది. మన తెలుగు సినిమాలు అన్నీ కూడా అల్లుడు గారికే హీరో వర్షిప్ ఇచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేశాయి. అయితే ఏపీ రాజకీయ తెర మీద మాత్రం ఇపుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇంతకాలం అల్లుడి జమానా సాగింది కానీ ఇపుడు అత్తదే రాజ్యం. రోజులు మావే అంటున్నారు నందమూరి లక్ష్మీపార్వతి. ఆమె చంద్రబాబుకు అచ్చమైన అత్తగారు. మామ ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచి ఆయన బొమ్మను మాత్రం పక్కన పెట్టుకుని పాతికేళ్ళ పాటు తనదైన రాజకీయాన్ని రంజుగా నడిపించిన చంద్రబాబుకు ఇపుడు బొమ్మ తిరగబడినట్లుగా ఉంది. అందుకే చెడ్డ రోజులు అలా క్యూ కట్టుకుని మరీ వచ్చేస్తున్నాయి.

అలా అయితే ఎలా ….

చంద్రబాబు మీద పాతికకు పైగా కేసులు పడ్డాయని అంటారు. అయితే ఏ ఒక్క కేసూ విచారణకు రాకుండా ఆయన తెలివిగా స్టేలు తెచ్చుకున్నారని కూడా ప్రత్యర్ధులు దెప్పిపొడుస్తారు. మిగిలిన కేసుల విషయంలో ఎలా ఉన్నా కూడా అత్త లక్ష్మీపార్వతి పెట్టిన కేసులో మాత్రం స్టే వెకేట్ అయింది. సుప్రీం కోర్టు అదేశానుసారం ఈ కేసులో కూడా రోజు వారీ విచారణ ఉంటుందని అంటున్నారు. పైగా ఇది చంద్రబాబు ఆస్తులకు సంబంధించిన కేసు. అంటే జగన్ మీద ఏ కేసు అయితే సీబీఐ పెట్టిందో ఇది కూడా అలాంటిదే. బాబు మీద ఈ కేసు పెట్టింది అత్త లక్షీపార్వతి. ఇక 2004 ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు తన ఆస్తులను తక్కువగా చూపారని అభియోగం.

కష్టమేనటగా ….?

సాధారణంగా ఆస్తుల కేసులు ఎపుడూ నేతలకు ఇబ్బందిగానే ఉంటాయి. అందునా ఒకనాడు పాలించిన తరువాత మాజీలు అయిన వారి విషయంలో ఇవి చేదు గురుతులుగా వెంటాడుతూనే ఉంటాయి. ఆస్తుల పెరుగుదల అన్నది కచ్చితంగా లెక్క కడితే మాత్రం ఏ నేత కూడా ఇంట్లో ఉండడు, జైలుకేన‌ని కూడా అంటారు. ఇక చంద్రబాబు మీద కేసు 2004 నాటిది. అప్పటికి ఆయన తొమ్మిదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు. అందువల్ల అత్తమ్మ లక్ష్మీపార్వతి సరైన ఆధారాలతో కనుక కేసుని ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు ఇబ్బందులో పడడం ఖాయమేనని అంటున్నారు. పైగా బాబు తనను ఆ కేసు నుంచి తప్పుకోమని వత్తిడి చేశారని ఆమె స్వయంగా చెబుతున్నారు. ఇక స్టే ని బాబు తెచ్చుకున్నారు అన్నది తెలిసిందే. అంటే ఏదో ఉండకపోతే బాబుకు ఇంత కంగారు ఎందుకు అన్నది లాజికల్ గా వచ్చే ప్రశ్న.

జైలుకేనటగా…?

తన అల్లుడు చంద్రబాబుని తాను జైలుకు పంపించకపోతే లక్ష్మీపార్వతిని కానే కాదని భీకరమైన ప్రతినను ఆమె చేశారు. బాబు విషయంలో తాను ఏసీబీ కోర్టు నుంచి హై కోర్టు, సుప్రీం కోర్టు ఇలా ఎన్ని అంచెలు ఉన్నాయో అన్నీ దాటుకుని వెళ్తానని కూడా అంటున్నారు. అంటే ఎక్కడా కూడా ఆయన్ని అసలు వదలనని కఠిన శపధమే చేస్తున్నారు. ఆమె బాధ అలాంటిది మరి. ఆమెను అడ్డం పెట్టుకుని ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన బాబు విషయంలో ఆమె ఈ జీవితకాలంలో అసలు క్షమించలేరు. పైగా ఆమె ఇపుడు అధికార పక్షం వైపు ఉన్నారు. ఈ కేసు ముందుకు సాగేలా ఆమెకు అన్ని రకాలైన అండదండలూ సమకూర్చేందుకు వైసీపీ కూడా రెడీగా ఉంటుంది. మొత్తానికి అత్తమ్మ శపధానికి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీకి చుక్కలు కనిపించడం ఖాయమేనా అంటే అవును అనే సమాధానం వస్తోందిట.

Similar News