రమణకు ఆ పదవి ఇస్తే ఇక అంతేనట

తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ వ్యవహారం టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎల్.రమణకు పదవి ఇస్తే అసంతృప్తి [more]

Update: 2021-07-30 11:00 GMT

తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ వ్యవహారం టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎల్.రమణకు పదవి ఇస్తే అసంతృప్తి తలెత్తే అవకాశముంది. బీసీ సామాజికవర్గం నేతలు టీఆర్ఎస్ లో అనేక మంది ఉన్నారు. తొలి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు కూడా ఉన్నారు. వారిని కాదని రమణకు ఏ పదవి ఇచ్చినా ఇబ్బందులు తలెత్తుతాయన్న భావనలో పార్టీ నాయకత్వం ఉందని తెలుస్తోంది.

ఏ మాత్రం ఉపయోగపడే…?

ఎల్. రమణ టీఆర్ఎస్ కు ఏ విధంగానూ ఉపయోగపడే నేత కాదు. జగిత్యాల వరకే పరిమితమైన నేత. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినా ఆయన ప్రభావం జగిత్యాలకే పరిమితం. అయినా ఈటల రాజేందర్ ను తప్పని సరి పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు పంపాల్సి రావడంతో బీసీ సామాజికవర్గం నేతను తీసుకురావాల్సి వచ్చింది. బీసీ నేతగా రమణకు పెద్దగా గుర్తింపు కూడా లేదు.

హామీ ఇవ్వడంతో….?

అయితే ఎల్. రమణను పార్టీలోకి తీసుకుంటున్నప్పడు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం ఏడు ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో ఎల్.రమణకు ఒక పోస్టును రిజర్వ్ చేసి పెట్టారంటున్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతల జోరు ఎక్కువగా ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

అనేకమంది వెయిటింగ్…..

ఎమ్మెల్సీ పదవుల కోసం అనేక మంది నేతలు ఎదురు చూస్తున్నారు. తొలి నుంచి కేసీఆర్ వెంట నడిచిన వాళ్లు మాత్రమే కాకుండా పార్టీకి ఉపయోగపడే నేతలు కూడా పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిలో బీసీలు, ఎస్సీ సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఎల్.రమణకు పదవి ఇస్తే మిగిలిన నేతల్లో అసంతృప్తి తలెత్తే అవకాశాలున్నాయి. ఆ ప్రభావం హుజూరాబాద్ ఉప ఎన్నికలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎల్ రమణకు ఇప్పట్లో పదవులు దక్కే అవకాశాలు లేవన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.

Tags:    

Similar News