రుణం తీరిపోయింది… ఇక రెస్ట్ మోడ్ లోకేనా?

కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ఆయన రెండుసార్లు రాజ్యసభ కు ఎన్నికయ్యారు. పన్నెండేళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పడు తిరిగి రాజ్యసభ కు [more]

Update: 2020-04-14 13:30 GMT

కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ఆయన రెండుసార్లు రాజ్యసభ కు ఎన్నికయ్యారు. పన్నెండేళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పడు తిరిగి రాజ్యసభ కు ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కడా లేవు. తాను ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడం, కేంద్రంలోనూ అధికారంలోకి లేకపోవడంతో ఇక రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోవడమే మంచిదని కేవీపీ రామచంద్రరావు భావిస్తున్నారు.

వైఎస్ ఆత్మగా…..

కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కేవలం సన్నిహితుడ కాదు వైఎస్ ఆత్మగా కేవీపీని పిలుచుకునే వారు. క్లాస్ మేట్స్ కావడం, వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా వెనకుండి అండగా నిలిచారు. ఇక వైఎస్ పాదయాత్రను కేవీపీ దగ్గరుండి నడిపించారు. ఇలా కేవీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కాంగ్రెస్ నేతకు లీడర్. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కేవీపీయే కథ నడిపించారంటారు.

కాంగ్రెస్ లోనే కొనసాగి…..

అలాంటి కేవీపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. తన రాజ్యసభ పదవి పూర్తయ్యేంత వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాలేదు. రెండు రాష్ట్రాల్లో సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణం. ప్రధానంగా ఏపీలో రఘువీరారెడ్డి పీసీపీ చీఫ్ గా ఉన్న ప్పుడు కేవీపీ కొంత యాక్టివ్ గా పనిచేశారు. నిజానికి కాంగ్రెస్ ను వైసీపీలోకి కేవీపీ వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

రాజ్యసభ పదవి పూర్తి కావడంతో….

కానీ కాంగ్రెస్ పార్టీతో కేవీపీకి రుణం తీరిపోయిందన్న వ్యాఖ్యలు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన ఇక రెస్ట్ మోడ్ లోకి వెళతారని, రాజకీయాలను పట్టించుకోరని కొందరు చెబుతున్నారు. కానీ కేవీపీ రామచంద్రరావు తన స్నేహితుడు కుమారుడు జగన్ కు సలహాదారుగా ఉంటారని కూడా అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ లో మాత్రం కేవీపీ వేలు పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తం మీద కేవీపీ రాజకీయంగా దూరంగా ఉంటారా? వైసీపీలో చేరి యాక్టివ్ అవుతారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News