Kuppam : కుప్పం నిద్ర పోనివ్వడం లేదే?

కుప్పం మున్సిపల్ ఎన్నిక చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. అక్కడ పరువు నిలబడాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ ముందు చంద్రబాబు రెండు రోజుల పాటు [more]

Update: 2021-11-09 03:30 GMT

కుప్పం మున్సిపల్ ఎన్నిక చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. అక్కడ పరువు నిలబడాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ ముందు చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి వచ్చారు. ఎన్నికల్లో ఎలాగైనా కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై ప్రతి రోజూ చంద్రబాబు స్థానిక నేతలతో చర్చించి వారికి డైరెక్షన్ ఇస్తున్నారు.

అప్రమత్తంగా…..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోనే మకాం వేయడంతో చంద్రబాబు మరింత అప్రమత్తమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు అమర్ నాధ్ రెడ్డి, పులివర్తి నాని వంటి నేతలను పంపారు. టీడీపీ గెలిచి తీరాల్సిందేనని చంద్రబాబు అక్కడి నేతలకు టార్గెట్ విధించారు. కుప్పం మున్సిపాలిటీని గెలుచుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడమే కాకుండా అవసరమైన నిధులను కూడా పార్టీ తరుపు నుంచి చంద్రబాబు స్థానిక నేతలకు సమకూర్చారు.

నిధుల వ్యయాన్ని….

నిధుల వ్యయంపై కూడా అమరావతి నుంచి వెళ్లిన కొందరు నేతలను పర్యవేక్షకులుగా కుప్పంలో నియమించారు. వారి నేతృత్వంలోనే నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. అలాగే టీడీపీ అభ్యర్థులు అధికార పార్టీ వత్తిళ్లకు భయపడకుండా, వారికి లొంగిపోకుండా ప్రత్యేకంగా చంద్రబాబు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అభ్యర్థుల ప్రతి కదలికను పరిశీలిస్తూ అక్కడి నుంచి నివేదికలను నిత్యం చంద్రబాబు తెప్పించుకుంటున్నారు.

సర్వేలతో….?

అక్కడ సామాజికవర్గాలుగా నేతలను రంగంలోకి దించారు. వీరితో ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అక్కడ ప్రత్యేకంగా నియమించారు. ఎమ్మెల్సీ దొరబాబుతో పాటు నిమ్మల కూడా పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నిక చంద్రబాబును టెన్షన్ పెడుతుందనే చెప్పాలి. ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సర్వేలు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News