ఈ వైసీపీ ఎమ్మెల్యే వెరీ వెరీ డిఫరెంట్

ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే పదవి చేపట్టగానే ఎక్కడ లేని ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఎమ్మెల్యేలను మనం ఎందరినో చూశాం. తన పరిధిలో మరొకరు జోక్యం చేసుకుంటే వెంటనే రంగంలోకి [more]

Update: 2020-01-10 00:30 GMT

ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే పదవి చేపట్టగానే ఎక్కడ లేని ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఎమ్మెల్యేలను మనం ఎందరినో చూశాం. తన పరిధిలో మరొకరు జోక్యం చేసుకుంటే వెంటనే రంగంలోకి దిగి వారి పని పట్టే వారిని చూశాం. భవిష్యత్తులో తమకు రాజకీయంగా పోటీ రాకుండా చూసుకుంటారు. కానీ ఇక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం ముగ్గురికి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తాను మాత్రం కేవలం రిబ్బన్ కటింగ్ లకే పరిమితవుతున్నారు. ఆయనే మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి.

యువకుడని…..

గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని కాదని మధ్యే మార్గంగా యువకుడైన కుందురు నాగార్జున రెడ్డికి జగన్ టిక్కెట్ కేటాయించారు. నాగార్జున రెడ్డి కేపీ కొండారెడ్డి తనయుడు. కేపీ కొండారెడ్డి సీనియర్ నేత. ఈయన 1985, 1989, 1999, 2004లో మార్కాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన వయసు మీద పడటంతో జగన్ ఆయన తనయుడు నాగార్జున్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ ఎంపిక చేశారు.

ముగ్గురికీ అప్పగించి…..

అయితే గత ఏడు నెలల నుంచి నాగార్జున రెడ్డి కేవలం ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకే పరిమితమయ్యారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. నాగార్జునరెడ్డి తండ్రి కేపీ కొండారెడ్డి, పిల్లనిచ్చని మామ ఉడుముల శ్రీనివాసరెడ్డి, సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి మూడు ప్రాంతాలను విభజించుకుని పెత్తనం చేస్తున్నారు. ఈ ముగ్గురిపైనే నియోజకవర్గాన్ని నాగార్జున రెడ్డి వదిలిపెట్టేశారు. ముగ్గరూ మూడు ప్రాంతాలను పంచుకున్నారు. తర్లుపాడు, మార్కాపురం రూరల్ ప్రాంతాలను తండ్రి కేపీ కొండారెడ్డి చూస్తుండగా, సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి మార్కాపురం టౌన్ బాధ్యలను చూస్తున్నారు. ఇక మామ ఉడుముల శ్రీనివాసరెడ్డి కొనకనమిట్ల, పొదిలి మండలాలను పర్యవేక్షిస్తున్నారు.

ముగ్గురూ సంతకం చేస్తేనే….?

ఏ పని కావాలన్నా వీరు ముగ్గురూ సంతకం చేయాల్సిందే. వారి లెటర్ హెడ్ లు ఉంటేనే ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పనిచేస్తారు. యువకుడు, విద్యావంతుడైన నాగార్జున రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలో ఏడు నెలల్లోనే షాడో ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. తనదైన స్టయిల్ లో పాలన ఉంటేనే వచ్చే ఎన్నికల్లో నాగార్జున రెడ్డికి ప్రజలు పట్టం కడతారు. ఇలాగే పరిస్థిితి ఉంటే ఆయనను ప్రజలు దూరం పెట్టక మానరు.

Tags:    

Similar News