పెద్దాయన ప్రెస్టేజ్ కు పోతున్నారా?

సీనియర్ నేత జానారెడ్డి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారా? తనకు చివరి అవకాశమని చెప్పేందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. [more]

Update: 2021-02-09 09:30 GMT

సీనియర్ నేత జానారెడ్డి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారా? తనకు చివరి అవకాశమని చెప్పేందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి ఉంటారని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. జానారెడ్డి అయితేనే ఇక్కడ బలమైన అభ్యర్థి. గత ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయిన జానారెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుంది.

అందరి అభిప్రాయంతోనే….

కానీ జానారెడ్డి ఇటీవల క్యాడర్ అభిప్రాయం మేరకు నడచుకుంటానని చెప్పారు. అందరూ అంగీకరిస్తే తన కుమారుడిని బరిలోకి దింపుతానని, లేకుంటే తన ప్రధాన అనుచరుల్లో ఎవరైనా పోటీ చేస్తానని అంటే వారికి కూడా అవకాశమిస్తానని చెప్పారు. అలా అంటూనే తాను వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించబోనని చెప్పారు. అంటే తనకు రాజకీయాల పట్ల, ఉప ఎన్నికల్లో పోటీ పట్ల పెద్దగా ఆసక్తి లేదని జానారెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది.

వారి నుంచే రావాలని….

అయితే పెద్దాయన బరిలో ఉండాల్సిందే అన్న నినాదం క్యాడర్ నుంచి విన్పించాలని, ప్రజల్లో కూడా సానుభూతి పెరుగుతుందనే జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలి. ఉప ఎన్నికల్లో విజయం సాధించినా ఇంకా మూడేళ్ల సమయం ఉంటుంది. జానారెడ్డి విజయం సాధిస్తే పార్టీలోనూ ప్రాధాన్యత లభిస్తుంది. సీఎల్పీ నేతగా కూడా ఆయనకు ఛాన్స్ దక్కే అవకాశముంది. అంతే కాకుండా దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీని తన విజయంతో లైఫ్ ఇచ్చానని చెప్పుకునే అవకాశం కూడా జానారెడ్డికి దక్కుతుంది.

చివరకు ఆయనే…..

అందుకే ఫైనల్ గా జానారెడ్డి మాత్రమే బరిలో ఉంటారన్నది వాస్తవం. కాంగ్రెస్ హైకమాండ్ సయితం జానారెడ్డి తప్ప ఆయన కుమారుడికి కూడా బీఫారం ఇచ్చేందుకు సిద్ధపడదు. ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడం, జానారెడ్డి అయితేనే గెలుస్తారన్న సర్వే రిపోర్టులు ఉండటంతో ఫైనల్ అభ్యర్థి జానారెడ్డి మాత్రమే అవుతారు. కానీ జానారెడ్డి వ్యాఖ్యలు ఇటు నేతలను కట్టడి చేయడానికి, ప్రజల్లో సానుభూతి పొందడానికే నన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News