జానారెడ్డికి అదే అస్సెట్.. అందుకే ఆయనకు?

రాష్ట్రంలో సీనియర్ నేత జానారెడ్డి. ఆయనకున్న రాజకీయ అనుభవం మరెవ్వరికీ లేదు. అనేక పదవులను ఆయన అనుభవించి రికార్డు సృష్టించారు. అలాంటి జానారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని [more]

Update: 2021-01-17 09:30 GMT

రాష్ట్రంలో సీనియర్ నేత జానారెడ్డి. ఆయనకున్న రాజకీయ అనుభవం మరెవ్వరికీ లేదు. అనేక పదవులను ఆయన అనుభవించి రికార్డు సృష్టించారు. అలాంటి జానారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జానారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. దీంతో జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఉప ఎన్నికను….

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నికలలో తన కుమారుడిని పోటీ చేయించాలని జనారెడ్డి భావించారు. తన వయసురీత్యా మరోసారి పోటీ చేయకూడదని తొలుత జానారెడ్డి నిర్ణయించారు. ఒకదశలో జానారెడ్డి కుటుంబం బీజేపీలోకి వెళుతుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని జానారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు.

పట్టున్న నేతగా….

నల్లగొండ జిల్లాలో పట్టున్న నేతగా జానారెడ్డికి పేరుంది. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమిని అతి తక్కువ సార్లు చవి చూశారు. ప్రజలు అంతగా ఆదరించారు ఆయనను. గత ఎన్నికల్లోనూ జానారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్యపై తక్కువ ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి జానారెడ్డి రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే నోముల నరసింహయ్య మృతితో ఉప ఎన్నిక వస్తుండటంతో జానారెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు.

విశ్వాసం ఉండటంతో…..

జానారెడ్డిని పార్టీలకతీతంగా అందరూ గౌరవిస్తారు. వాస్తవానికి జనారెడ్డిని ఈ ఎన్నికల్లో ఎదుర్కొనడం అధికార టీఆర్ఎస్ కు కష్టమే. అయితే అన్ని ఉప ఎన్నికలు లాంటివి కాదు. జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారన్న విశ్వాసం ప్రజల్లో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత జానారెడ్డికి ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జానారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని సాగర్ ఉప ఎన్నికల్లో పరీక్షించుకోనున్నారు.

Tags:    

Similar News