కూనను అక్కున చేర్చుకుని… . ?

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాల్సి వస్తే కూన రవి కుమార్ పేరే ముందు వస్తుంది. ఆయన రాజకీయం గట్టిగా పదేళ్ళు. [more]

Update: 2021-06-23 00:30 GMT

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాల్సి వస్తే కూన రవి కుమార్ పేరే ముందు వస్తుంది. ఆయన రాజకీయం గట్టిగా పదేళ్ళు. కానీ కింజరాపు ఫ్యామిలీని కూడా మరపించేలా జిల్లా మీద పట్టు సాధించారు. ఏకంగా జగన్ సర్కార్ మీద పదునైన విమర్శలు చేయాలంటే కూన రవి కుమార్ ముందుంటారు. ఆయన నోటికి అదుపు ఉండదు, యాక్షన్ కి ఎపుడూ తయారు అని చెబుతారు. ఆయన గత రెండేళ్లలో కేసుల పాలు అయి ఎన్నో సార్లు జైలుకు వెల్ళి వచ్చారు. అయినా వైసీపీ సర్కార్ ఆయన మీద కేసులు పెడుతూనే ఉంది. దాంతో జిల్లాలో ఆయన పేరు మారుమోగుతోంది.

లుకలుకలేనా …?

కంచుకోట లాంటి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అసలే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరస ఓటములతో సైకిల్ కి పంక్చర్లు పడుతున్నాయి. దానికి తగినట్లుగా నేతల మధ్యన విభేదాలు పసుపు పార్టీ ఉసురు తీస్తున్నాయి అంటున్నారు. ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావుకు అచ్చెన్ననాయుడుకు పడదు అంటారు. మరో వైపు గౌతు ఫ్యామిలీ రాజకీయం వేరుగా ఉంటుంది. ఇక శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న కూన రవి కుమార్ తో అచ్చెన్న వర్గానికి అసలు పడడంలేదు అంటున్నారు. దానికి తోడు కూన రవి కుమార్ ఇలా ఒక్కసారిగా ఎదిగిపోవడం కూడా జిల్లా పెద్దలకు మింగుడుపడడంలేదు అంటున్నారు.

ఒంటరి పోరేనా…?

వైసీపీ మీద నోరు పారేసుకుని చాలా సార్లు కూన జైలు పాలు అయ్యారు. ఆ సమయంలో ఆయనకు జిల్లా పెద్దల నుంచి ఆశించిన మద్దతు దక్కలేదు అంటున్నారు. దాంతో ఎందుకొచ్చిన పోరాటం ఆరాటమని కూన రవి కుమార్ కొన్నాళ్ళుగా సైలెంట్ మోడ్ లోని వెళ్ళిపోయారు అని చెబుతారు. అయితే తిరుపతి ఎపిసోడ్ తో మళ్లీ కూన సౌండ్ చేస్తున్నారుట. తిరుపతిలో లీక్ అయిన ఒక వీడియో లో అచ్చెన్నాయుడు లోకేష్ మీద చేసినట్లుగా చెబుతున్న కామెంట్స్ తో అధినాయకత్వం ఆయన్ని కొంత దూరం పెడుతోందిట. అదే సమయంలో కూన రవి కుమార్ లాంటి వారిని గట్టిగా ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. మేమున్నాం, నీకేం భయం లేదు పార్టీ కోసం గట్టిగా పోరాడూ అంటూ నేరుగా హై కమాండ్ నుంచే సపోర్ట్ రావడంతో కూన రవి కుమార్ మళ్ళీ ఫీల్డ్ లో కి వచ్చి సిక్సర్లు కొడుతున్నారు అంటున్నారు.

ఎత్తుగడ అదేనా …?

అసలే సిక్కోలు టీడీపీలో వర్గ పోరు ఉంది. అది చాలదు అన్నట్లుగా హై కమాండ్ కూడా దూరి కొందరిని సపోర్ట్ చేయడంతో కొత్త సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అయితే కూన రవికుమార్ బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. జిల్లాలో ఆ వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. జగన్ సైతం ఈ సామాజిక వర్గాన్ని గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా టీడీపీ ఈ వర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడు హై కమాండ్ సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుని మరీ కూన రవి కుమార్ ను ముందుకు తెస్తోంది అంటున్నారు. మొత్తం మీద చూస్తే జిల్లా రాజకీయాల్లో అచ్చెన్న ప్రాభవం తగ్గించే విధంగా కధ సాగుతోందా అన్నదే టీడీపీలో చర్చగా ఉందిట. ఏది ఏమైనా కూన ఇపుడు సిక్కోలు టీడీపీకి పెద్ద దిక్కు అయిపోయారు అన్న మాట అయితే ఉంది.

Tags:    

Similar News