వదలేసి వెళ్లి వచ్చినా జగన్ ఆదరించారుగా?

ఆయన వైఎస్సార్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. ఆయన మరణానంతరం జగన్ వైపు కూడా చూశారు. కానీ జగన్ కోరుకున్న సీటు ఇవ్వలేదని అలిగి కుంభా రవిబాబు [more]

Update: 2021-04-11 03:30 GMT

ఆయన వైఎస్సార్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. ఆయన మరణానంతరం జగన్ వైపు కూడా చూశారు. కానీ జగన్ కోరుకున్న సీటు ఇవ్వలేదని అలిగి కుంభా రవిబాబు టీడీపీ వైపు మళ్లారు. అక్కడా చుక్కెదురు కావడంతో తిరిగి వైసీపీలోకే వచ్చారు. మొత్తానికి ఇన్నాళ్ళకు జగన్ ఆయన్ని ఆదరించి రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ ర్యాంక్ పదవిని అప్పగించారు. ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుని నియమించారు. తాజాగా ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు.

బలమైన నేతగా…?

గతంలో కాంగ్రెస్ తరఫున ఎస్ కోట నుంచి కుంభా రవిబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తరాంధ్రాలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. అయితే 2009 ఎన్నికలో ఓడిపోవడంతో కొంత రాజకీయంగా వెనకబడ్డారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఉన్న సాన్నిహిత్యంతో తెలుగుదేశంలో చేరినా కుంభా రవిబాబుకు బాబు ద్వారా ఏ పదవులూ దక్కలేదు. అలా పుష్కర కాలం రాజకీయ చీకటిగానే గడచిపోయింది. ఇన్నేళ్లకు ఆయనకు సరైన పదవి దక్కిందని అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

పోటీకి వస్తారా…?

ఇక ఉత్తరాంధ్రాలో పదునైన వ్యూహాలు రచించే గిరిజన నేతగా ఉన్న కుంభా రవిబాబు లైమ్ లైట్ లోకి రావడంతో వైసీపీలో ఆయన చాలా మందికి పోటీకి వస్తారు అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లో అరకు నుంచి ఎంపీగా ఆయనకే టికెట్ దక్కాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. ఈసారి మాత్రం కుంభా రవిబాబు ఏదో సీటు నుంచి పోటీ చేసి చట్ట సభలలో ప్రవేశిస్తారు అంటున్నారు. ఎటూ గిరిజనులలో వైసీపీకి గట్టి పట్టు ఉంది. కాబట్టి ఎక్కడ నుంచి అయినా ఆయన గెలుచుకుని రావడం ఖాయమని అంటున్నారు.

అదే టార్గెట్…

ఇక కుంభా రవిబాబు సీనియర్ నేతగా ఉన్నారు. మంత్రి పదవిని కూడా చేపట్టాలని ఆశపడుతున్నారు. అందువల్ల మరో మూడేళ్ల పాటు ఈ నామినేటెడ్ పదవిలో ఉంటూనే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేలా పావులు కదుపుతారని అంటున్నారు. ఆయన కనుక ఎమ్మెల్యేగా నెగ్గి వైసీపీ మళ్ళీ పవర్ లోకి వస్తే మంత్రి కావడం ష్యూర్ అంటున్నారు అనుచరులు. మొత్తానికి జగన్ తో నడిచి, మధ్యలో విడిచి మళ్ళీ కలసి ఇలా ఎన్నో మలుపులు తిరిగిన కుంభా రవిబాబు రాజకీయం ఇపుడు కొత్త వెలుగులతో ఉదయించిందని అంటున్నారు. మరి జగన్ ఆశలను నెరవేర్చి గిరిజనం మద్దతుని ఆయన పూర్తిగా కూడగడితేనే మంత్రి పదవి కోరిక తీరుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News