లెక్కలన్నీ నెగిటివ్ గానే

కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కు రోజులు దగ్గరపడినట్లే కన్పిస్తుంది. లెక్కలన్నీ పక్కాగా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఈనెల 18వ తేదీన కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. కుమారస్వామి బలపరీక్షకు [more]

Update: 2019-07-16 16:30 GMT

కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కు రోజులు దగ్గరపడినట్లే కన్పిస్తుంది. లెక్కలన్నీ పక్కాగా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఈనెల 18వ తేదీన కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. కుమారస్వామి బలపరీక్షకు ముహూర్తం ఈ నెల 18వ తేదీగా స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయించారు. దీంతో గత రెండు వారాలుగా టీవీ సీరియల్ గా కొనసాగుతున్న కర్ణాటక హైడ్రామాకు ఎల్లుండితో తెరపడనుంది. 16మంది ఎమ్మెల్యేలు పార్టీలను వీడటంతో కుమారస్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

బలాబలాలు చూసుకుంటే….

కర్ణాటక శాసనసభలో మొత్తం 224 మంది శాసనసభ్యులున్నారు. సాధారణంగా బలపరీక్షలో నెగ్గాలంటే 112 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇది నిన్నటి ఫిగర్. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి 16 మంది శాసనసభ్యులు వెళ్లిపోవడంతో వారిపై అనర్హత వేటు వేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పుడు సభలో వారిని మినహాయిస్తే మొత్తం శాసనసభ్యుల సంఖ్య 208 మాత్రమే. దీనిని లెక్కలోకి తీసుకుంటే కుమారస్వామికి 104 మంది సభ్యులు మద్దతు తెలపాల్సి ఉంటుంది.

ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో….

అయితే 16 మంది శాసనసభ్యులు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నుంచి 16 మంది శాసనసభ్యులు వెళ్లిపోవడంతో ఆ రెండు పార్టీల సభ్యుల సంఖ్య 101 మంది మాత్రమే. మరోవైపు ప్రతిపక్ష పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 105 మంది సభ్యులున్నారు. ఇప్పుడు అదనంగా మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతు తెలపడంతో బీజేపీ బలం 107కు పెరిగింది. ఈ లెక్కలన్నింటినీ చూస్తే కుమారస్వామి ప్రభుత్వం పతనం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.

యడ్యూరప్పలో ఆత్మవిశ్వాసం….

కుమారస్వామి బలపరీక్షకు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో తమ శాసనసభ్యులందరినీ అన్ని పార్టీలూ రిసార్ట్స్ కు తరలించాయి. వారందరినీ నేరుగా ఈ నెల 18వ తేదీన శాసనసభకు తీసుకువచ్చే వ్యూహంలో అన్ని పార్టీలూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం ఈసారి గెలుపు తమదేనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సిద్ధరామయ్య మానసికంగా ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయ డ్రామాకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది.

Tags:    

Similar News