వేరు పడినట్లేనా? అలాగే ఉందిగా?

కర్ణాటక రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరితో కలుస్తారో చెప్పలేని పరిస్థిితి. నిన్న మొన్నటి వరకూ జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ సయుంక్తంగా రాష్ట్రాన్ని పాలించాయి. ఆ తర్వాత [more]

Update: 2020-10-03 17:30 GMT

కర్ణాటక రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరితో కలుస్తారో చెప్పలేని పరిస్థిితి. నిన్న మొన్నటి వరకూ జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ సయుంక్తంగా రాష్ట్రాన్ని పాలించాయి. ఆ తర్వాత ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. తమ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చిన ఆగ్రహం సహజంగా జేడీఎస్ నేత కుమారస్వామికి బీజేపీపై ఉండాలి. కానీ విచిత్రంగా ఆయన కాంగ్రెస్ ను ఆడిపోసుకుంటున్నారు.

కాంగ్రెస్ తో కలసి నడవాల్సిన…..

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ అధినేత దేవెగౌడ ఎన్నికకు సహకరించింది. అయితే ఇటీవల కాలంలో కుమారస్వామి బీజేపీకి దగ్గరవుతున్నారన్నది అర్థమవుతుంది. జరుగుతున్న పరిణామాలు, సంఘటనలు కూడా దీనికి అద్దంపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కుమారస్వామి యడ్యూరప్ప తో భేటీ అయ్యారు. అయితే ఇది సాధారణ సమావేశమేనని కుమారస్వామి కొట్టిపారేశారు.

వేరుపడినట్లేనా?

ఇక ఇప్పుడు తాజాగా కర్ణాటక అసెంబ్లీలో కలసి నడవాల్సిన విపక్షాలు వేరుపడ్డాయి. కాంగ్రెస్ అధికార పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా జనతాదళ్ ఎస్ మాత్రం దానికి మద్దతివ్వకపోవడం విశేషం. కాంగ్రెస్ నేతలు తమను సంప్రదించకుండానే అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చారని కుమారస్వామి పైకి అంటున్నప్పటికీ, బీజేపీకి దగ్గరవ్వడం వల్లనే జేడీఎస్ తమతో కలసి రావడం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడుతుంది.

అన్నింటా కుమారస్వామిది……

డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడయ్యాక రెండు పార్టీలూ మరింత కలసి పనిచేస్తాయని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుంది. యడ్యూరప్ప ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచాయతీ రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించగా కుమారస్వామి మాత్రం సమర్థించారు. పైగా యడ్యూరప్ప కుటుంబం అవినీతిని కాంగ్రెస్ ప్రశ్నిస్తుండగా, ఎవరి ఇంట్లో అవినీతి లేదని కుమారస్వామి తిరిగి నిలదీస్తుండటం ఇందుకు అద్దం పడుతుంది. ఇలా జేడీఎస్, కాంగ్రెస్ లు వేరుపడిన విధంగానే వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News