దిగాక… చేతులెత్తేస్తే ఎలా…??

జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ లోక్ సభ ఎన్నికలకు ముందు తమకు పన్నెండు లోక్ సభ స్థానాలు కావాలని అడిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద [more]

Update: 2019-03-26 16:30 GMT

జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ లోక్ సభ ఎన్నికలకు ముందు తమకు పన్నెండు లోక్ సభ స్థానాలు కావాలని అడిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద కూడా పంచాయతీ పెట్టారు. పన్నెండు సీట్లకు తగ్గితే ససేమిరా అన్నారు. చివరకు తొమ్మిది స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే నామినేషన్లు ముగిసే సమయానికి దేవెగౌడ చేతులెత్తేసినట్లు కన్పిస్తుంది. సరైన అభ్యర్థులు దళ్ లో దొరకకపోవడంతో దేవెగౌడ ఎనిమిది స్థానాల్లోనే పోటీ చేయనున్నారు.

ఒక నియోజకవర్గాన్ని వదులుకుని…..

బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి దేవెగౌడ తొలుత పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ తొలుత ససేమిరా అంది. తమకు పట్టున్న స్థానం అని తేల్చి చెప్పింది. చివరకు దేవెగౌడ పట్టుబట్టి మరీ బెంగుళూరు ఉత్తర నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా దక్కించుకున్నారు. కానీ అక్కడ సరైన అభ్యర్థి దొరకలేదు. చివరకు కాంగ్రెస్ నేతలనే జేడీఎస్ గుర్తు మీద పోటీ చేయాలని ప్రయత్నించారు. దానికి అంగీకరించకపోవడంతో బెంగళూరు ఉత్తర స్థానంచివరకు కాంగ్రెస్ కే దక్కింది. కాంగ్రెస్ తొలి నుంచి చెబుతున్నట్లుగా జేడీఎస్ ను ఎనిమిది స్థానాలకే పరిమితమయ్యంది.

మూడు చోట్ల ఇబ్బంది…..

బలమైన అభ్యర్థులు లేకపోవడం, మనవళ్లిద్దరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత దళపతి దేవెగౌడపై పడటంతోనే ఆయన ఎక్కువ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దేవెగౌడ తుముకూరు నుంచి, మనవళ్లు ప్రజ్వల్ హాసన్, నిఖిల్ గౌడ మాండ్య నుంచి బరిలోకి దిగారు. తుముకూరు ఎలా గున్నా మాండ్య, హాసన్ నియోజకవర్గాలు దేవెగౌడ కుటుంబానికి ఇబ్బందిగా మారాయి. హాసన్ బాధ్యతలను పూర్తిగా మంత్రి రేవణ్ణ కు అప్పగించారు. మాండ్య నియోజకవర్గం బాధ్యతలను స్వయంగా దేవెగౌడ చూసుకోవాలని నిర్ణయించారు.

కుమార అసహనం…..

హాసన్, మాండ్య నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు సహకరించడం లేదన్న కోపంతో జనతాదళ్ ఎస్ ఉంది. ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైత్రీ ధర్మాన్ని పాటించడం లేదన్నారు. మాండ్య, హాసన్, తుముకూరుల్లో కాంగ్రెస్ శ్రేణులు సహకారం ఇవ్వడం లేదని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందిగా మారింది. మొత్తం మీద ఈ మూడు స్థానాల్లో గెలిపించుకోవడం ముఖ్యమంత్రి కుమారస్వామికి కూడా పరీక్షలా మారింది. జరుగుతున్న పరిణామాలను చూసి ఆయన అందుకే అసహనం వ్యక్తం చేశారంటున్నారు.

Tags:    

Similar News