గంటల్లోనే…. పడిపోతుందా

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. మొత్తం 16మంది ఎమ్మెల్యేలు అసమ్మతి గూటి నుంచి బయటకు రావడం లేదు. రేపటి వరకూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం అమలుకానుండటంతో [more]

Update: 2019-07-15 16:30 GMT

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. మొత్తం 16మంది ఎమ్మెల్యేలు అసమ్మతి గూటి నుంచి బయటకు రావడం లేదు. రేపటి వరకూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం అమలుకానుండటంతో కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం గంటల సమయమే ఉండటంతో అసంతృప్త నేతలు తిరిగి వస్తారా? రారా? అన్నది కాంగ్రెస్ లో కంగారు రేపుతోంది. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరూ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశాలు లేవన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కుమారస్వామి ప్రభుత్వానికి గండం పొంచి ఉంది.

తిరిగి వెళ్లిపోవడంతో…..

డీకే శివకుమార్ చర్చలతో తిరిగి పార్టీలోకి వచ్చినట్లే వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంబీటీ నాగరాజు తిరిగి అసమ్మతి గూటికి చేరిపోయారు. నాగరాజు తో పాటు మరికొందరు పార్టీలోకి తిరిగి వస్తారని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్మారు. కానీ వస్తారనుకున్న నేతలు కూడా తిరిగి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ ఇక మానసికంగా సిద్ధమయినట్లే కన్పిస్తోంది. గులాం నబీ ఆజాద్, కమల్ నాధ్ వంటి సీనియర్ నేతలు కర్ణాటకకు వచ్చి పరిస్థితులను సమీక్షించినా ఫలితం లేదు.

అందరూ ఏకతాటిపై….

ముఖ్యంగా కుమారస్వామి ప్రభుత్వం కూలి పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పరిస్థిితి కన్పిస్తోంది. కుమారస్వామి తాజా రాజకీయ పరిస్థితులపై తన తండ్రి దేవెగౌడతో గంటల పాటు చర్చలు జరిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కుమారస్వామి తాను బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని భావించారు. కానీ 16 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ చేత ఆమోదింప చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

స్పీకర్ నిర్ణయంపైనే…

దీంతో ఇక కుమారస్వామి ప్రభుత్వం గంటల్లోకి వచ్చిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బలపరీక్షకు సిద్ధమయినా ఆయన సభలో విజయం సాధించే అవకాశాలు లేవు. అందుకే ముందుగా కుమారస్వామి రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా కన్నడనాట జోరుగా సాగుతోంది. అయితే రేపు స్పీకర్ రమేష్ కుమార్ తీసుకోబోయే నిర్ణయంపైనే కుమారస్వామి ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంటుందంటున్నారు. మొత్తం మీద కుమార ప్రభుత్వానికి గంటలు గడిచే కొద్ది కౌంట్ డౌన్ స్టార్టయినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News