ఈ పెద్దోళ్లున్నారే… వీళ్లు ఎప్పుడూ ఇంతే?

సీనియర్లు ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీల్లో ప్రమాదమే. ప్రాంతీయ పార్టీల నాయకత్వానికి సీనియర్లు, బంధువుల నుంచే ఎప్పటికైనా ముప్పు ఉంటుంది. ఇది చరిత్ర చెప్పిన పాఠం. దేశంలో ఎన్నో [more]

Update: 2020-03-04 17:30 GMT

సీనియర్లు ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీల్లో ప్రమాదమే. ప్రాంతీయ పార్టీల నాయకత్వానికి సీనియర్లు, బంధువుల నుంచే ఎప్పటికైనా ముప్పు ఉంటుంది. ఇది చరిత్ర చెప్పిన పాఠం. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు సీనియర్ నేతలు, బంధువుల కారణంగానే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎదువుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడా. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్, తమిళనాడులో డీఎంకే వంటి పార్టీలు ఇలా సీనియర్లు, బంధువుల నుంచి ఇబ్బందుల పాలయ్యాయి.

కుటుంబ పార్టీయే…..

ప్రాంతీయ పార్టీ అంటేనే కుటుంబ పార్టీగా చెప్పుకోవాలి. ఆ రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు, భావోద్వేగాల కారణంగా ఏర్పడినవే ప్రాంతీయ పార్టీలు. వీరి మనుగడ ఎంతవరకూ ఉంటుందన్నది పక్కన పెడితే పటిష్ట మైన నాయకత్వం ఉన్నంత వరకూ వాటికి ఢోకా ఉండదు. ఇప్పుడు కర్ణాటకలో జనతాదళ్ ఎస్ పరిస్థితి అలాగే తయారయింది. జనతాదళ్ ఎస్ ను దేవెగౌడ స్థాపించారు. కర్ణాటకలో ఒక సామాజికవర్గం ఓటు బ్యాంకుతో పాటు భావోద్వేగాలతో జేడీఎస్ పార్టీ తొలినాళ్లలో సక్సెస్ అయింది. అయితే దేవెగౌడ జాతీయ రాజకీయాలవైపు వెళ్లడం ఆయన తనయుడు కుమారస్వామి చేతిలోకి పగ్గాలు రావడంతోనే పతనం ప్రారంభమయిందని చెప్పక తప్పదు. పార్టీలోనే ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పనితీరు కన్నా పక్కోడి దయపైనే…..

నిజానికి పధ్నాలుగు నెలల పాటు కుమారస్వామి ప్రభుత్వం ఆయన పనితీరు మీద కన్నా అదృష్టం మీద, పక్కోడి దయమీదనే నడిచిందని చెప్పాలి. ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు చేయడం మొదలెట్టారు కుమారస్వామి. డీకే శివకుమార్, పరమేశ్వరలను చేరదీసి సిద్ధరామయ్యను దూరం పెట్టారు. తక్కువ స్థానాలతో ముఖ్యమంత్రి పదవిని ఎక్కి ఎక్కువ స్థానాలున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లెక్క చేయలేదు. వారి నియోజకవర్గ అభివృద్ధిని గురించి కూడా పట్టించు కోలేదు. అదే కుమారస్వామి చేసిన తప్పు. సీనియర్ నేత సిద్ధరామయ్య కుమారస్వామికి చుక్కలు చూపారు. సీనియర్ నేతలు రాజీనామా చేసి వెళ్లడంతో సంకీర్ణ సర్కార్ కుప్పకూలి కుమారస్వామి మాజీ అయిపోయారు.

సీనియర్ నేతలను…..

ఇక మాజీ అయిన తర్వాత కూడా కుమారస్వామికి సీనియర్ల నుంచి సెగ తప్పడం లేదు. ఇప్పటికే అనేక మంది బీజేపీకి టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. దాదాపు పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఊ అంటే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో కూడా సీనియర్ నేతలే ఎక్కువ. ప్రధానంగా జీటీ దేవెగౌడ పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నాయి. జీటీ దేవెగౌడ మొన్నటి ఎన్నికల్లో చాముండేశ్వరిలో సిద్ధరామయ్యను ఓడించారు. ఆయన కుమారస్వామి నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే జీటీ దేవెగౌడ పై బహిష్కరణ వేటు వేయడానికి కుమారస్వామి సిద్ధపడుతున్నారు. సీనియర్ నేతలను ఎవరినీ పెద్దగా ఉపేక్షించాల్సిన అవసరం లేదని కుమారస్వామి అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కుమారస్వామి సీనియర్ నేతలను వదిలించుకోవడానికే సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News