ముంచడంలో ఈయనను మించినోళ్లు లేరా?

రాజకీయాల్లో తండ్రి స్థాపించిన పార్టీని సక్సెస్ ఫుల్ గా కొంత మంది మాత్రమే ముందుకు తీసుకెళ్లగలిగారు. తండ్రి ఉన్నంతకాలం ఆయన రాజకీయ వ్యూహాలతో పార్టీని నడిపించినా, అనంతర [more]

Update: 2020-12-29 17:30 GMT

రాజకీయాల్లో తండ్రి స్థాపించిన పార్టీని సక్సెస్ ఫుల్ గా కొంత మంది మాత్రమే ముందుకు తీసుకెళ్లగలిగారు. తండ్రి ఉన్నంతకాలం ఆయన రాజకీయ వ్యూహాలతో పార్టీని నడిపించినా, అనంతర కాలంలో అనేక చోట్ల కుమారులు అభాసుపాలయ్యారు. మహారాష్ట్రలో బాల్ థాక్రే స్థాపించిన శివసేనను ఉద్ధవ్ థాక్రే సమర్థవంతంగా నడుపుతున్నారు. సమాజ్ వాదీ పార్టీని అఖిలేష్ యాదవ్ సక్రమంగా నడపలేకపోయారు. ఇప్పుడు కర్ణాటకలో కుమారస్వామి కూడా పార్టీని సమర్థవంతంగా నడపలేకపోతున్నారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

పార్టీని స్థాపించి….

కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా జనతాదళ్ ఎస్ ను దేవెగౌడ స్థాపించారు. రెండు పార్టీల మీద వ్యతిరేకతను క్యాష్ చేసుకుని దేవెగౌడ జేడీఎస్ పలుమార్లు అధికారంలోకి తేగలిగారు. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయగలిగారు. కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలిగారంటే.. అది దేవెగౌడ రాజకీయ వ్యూహంతోనే. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు.

ఆయన నాయకత్వంపైన….

అయితే దేవెగౌడకు వయసు పెరిగిపోవడం, పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో కుమారస్వామి మొత్తం బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. కానీ కుమారస్వామి నాయకత్వంపై పార్టీ నేతలకే నమ్మకం లేకుండా పోయింది. వరస ఓటములు కూడా కుమారస్వామి నాయకత్వానికి పరీక్షగా నిలిచాయి. దీంతో జేడీఎస్ ఇక మనుగడ సాగించలేదన్న అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.

కుటుంబ పార్టీగా….

కుటుంబ పార్టీగా ముద్రపడటం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకే పార్టీ పరిమితం అవ్వడంతో పార్టీ నేతలు జారుకునే పనిలో ఉన్నారు. బలంగా ఉన్న ప్రాంతాల్లో సయితం ఇటీవల జేడీఎస్ బలహీన పడింది. కుమారస్వామి అనేక సార్లు పర్యటించినా ఫలితం లేదు. దీంతో దాదాపు 12 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. వీరంతా జెండా పీకేస్తే పార్టీ మరింత ఇబ్బందుల్లో పడటం ఖాయంగా కన్పిస్తుంది. మొత్తం మీద కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో తన సమర్థతను ఎలా నిరూపించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News