మైండ్ గేమ్ లో చిక్కుకుపోయారా?

కర్ణాటకలో కాంగ్రెస్ మైండ్ గేమ్ ప్రారంభించింది. జనతాదళ్ ఎస్ బీజేపీ లో విలీనం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. త్వరలోనే [more]

Update: 2020-12-21 17:30 GMT

కర్ణాటకలో కాంగ్రెస్ మైండ్ గేమ్ ప్రారంభించింది. జనతాదళ్ ఎస్ బీజేపీ లో విలీనం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. త్వరలోనే బీజేపీలో జేడీఎస్ విలీనం అవుతుందన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలను జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి తప్పు పట్టారు. తాము ఎట్టిపరిస్థితుల్లో బీజేపీలో జేడీఎస్ ను విలీనం చేయబోమని, ఏ పార్టీలో విలీనం చేయమని కుమారస్వామి స్పష్టం చేశారు.

కావాలనే టార్గెట్….

సిద్ధరామయ్య రాజకీయ ప్రయోజనం కోసమే తమ పార్టీని, తమ కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారని కుమారస్వామి మండిపడ్డారు. తనకు రాజకీయ బిక్ష పెట్టిన దేవెగౌడనే ఏకవచనంతో సిద్ధరామయ్య సంభోదించడాన్ని కుమారస్వామి తప్పుపట్టారు. గత కొంతకాలంగా కుమారస్వామి బీజేపీకి దగ్గరవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రెండుసార్లు భేటీ కావడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ పై భగ్గుమంటున్న…..

కాంగ్రెస్ పార్టీ తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడంతో ఆయన ఆ పార్టీపై భగ్గుమంటున్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో సయితం జేడీఎస్ విడిగానే పోటీ చేసింది. రానున్న ఎన్నికల్లోనూ జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని కుమారస్వామి ప్రకటించారు. తండ్రి దేవెగౌడ మాత్రం కాంగ్రెస్ కు కొంత అనుకూలంగానే ఉన్నారు. తనకు రాజ్యసభ పదవి ఇవ్వడంలో సహకరించడంతో పాటు లౌకిక వాద పార్టీ కావడంతో దేవెగౌడ మాత్రం బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు.

తండ్రీ కొడుకుల దారి వేరు….

కానీ కుమారస్వామి మాత్రం రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి కొంత అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇది గమనించిన సిద్ధరామయ్య తరచూ జేడీఎస్ ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కుమారస్వామి ఇటీవల ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త చట్టాలతో రైతులకు అన్యాయం జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా కుమారస్వామి ఉద్వేగంగా అనడం విశేషం. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్ మైండ్ గేమ్ లో కుమారస్వామి విలవిలలాడుతున్నారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News