స్లోగా అర్థమవుతుందిగా

తెలంగాణ మంత్రి మండలి లో తిరిగి ముఖ్యమంత్రి తనయుడు కెటిఆర్ రీఎంట్రీ కి రంగం సిద్దమైందా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండోసారి అధికారంలోకి వచ్చిన [more]

Update: 2019-08-27 06:30 GMT

తెలంగాణ మంత్రి మండలి లో తిరిగి ముఖ్యమంత్రి తనయుడు కెటిఆర్ రీఎంట్రీ కి రంగం సిద్దమైందా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తన కుటుంబ సభ్యులను వ్యూహాత్మకంగా పక్కన పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కుమారుడు కేటీఆర్ కి తిరిగి మంత్రి పదవిని ఇచ్చేందుకు రెడీ అయ్యారంటున్నాయి గులాబీ శ్రేణులు. ఇప్పటికే కెటిఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో పెద్దఎత్తునే నడుస్తుంది. దీనికి తోడు తాజాగా ఎంఐఎం ఎంపి అసద్దుద్ధీన్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ కి గులాబీ బాస్ పదవిని ఇవ్వనున్నారన్న సంకేతాలను వెలువరిస్తున్నాయి.

ఈటెలకు రాం రాం …

మంత్రి ఈటెల రాజేంద్ర తో బాటు మరో ఇద్దరికి ఉద్వాసన పలికి ఆ స్థానాల్లో తన వెయిటింగ్ లిస్ట్ లో వున్న కొందరి బెర్త్ లు గులాబీ బాస్ కన్ఫర్మ్ చేస్తారని అంటున్నారు. హరీష్ రావు తో సఖ్యతగా ఉండటమే ఈటెల పదవికి గండం తెచ్చిపెట్టిందన్న ప్రచారం ఎక్కువైంది. ఇప్పటికే కారు పార్టీ అనుకూల మీడియా లో ఈటెల పై వేటు తప్పదన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరోపక్క ఈ అంశాన్ని ఈటెల ఖండించినా ఆయన సేవలకు కెసిఆర్ స్వస్తి పలుకుతారని గులాబీ పార్టీలో చర్చ. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత హరీష్ రావు తో బాగా గ్యాప్ పెరిగిందన్నది గులాబీ పార్టీ టాక్. ఈ నేపథ్యంలోనే వచ్చే మంత్రి వర్గంలో హరీష్ కి స్థానం దక్కడం అనుమానమే.

బిజెపి పొంచి ఉండటం తో …

బిజెపి నుంచి పొంచి వున్న రాజకీయ ముప్పును ఎదుర్కోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తుంది టిఆర్ఎస్. నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో బాటు కమలనాధుల ఎత్తులకు పై ఎత్తుల రాజకీయాన్ని సాగించాలని కసరత్తు మొదలు పెట్టింది. అందుకోసమే శ్రావణ మాసం ముగిసేలోగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం లేదా విజయ దశమి వరకు ఆగి పార్టీలో కీలక నేతలకు మరింత బాధ్యతలు అప్పగించి రాజకీయ యుద్ధాన్ని సమర్ధంగా ఎదుర్కోవాలని గులాబీ బాస్ యువరాజు కేటీఆర్ పట్టాభిషేకానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News