అక్కడే తప్పు చేశారట…!!

ప్రభాస్ అని పేరు పెట్టి ఇపుడు పిలవడంలేదు. బాహుబలి అంటున్నారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింద్ ఆ చిత్రం. ఒక్క ప్రభాస్ నే కాదు. అటువంటి సందర్భం [more]

Update: 2019-08-01 08:00 GMT

ప్రభాస్ అని పేరు పెట్టి ఇపుడు పిలవడంలేదు. బాహుబలి అంటున్నారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింద్ ఆ చిత్రం. ఒక్క ప్రభాస్ నే కాదు. అటువంటి సందర్భం ఏదైనా వచ్చినా బాహుబలి అనేయడం అలవాటుగా మారింది. బాహుబలితో ప్రభాస్ రేంజి పెరిగింది, ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు, అంతే కాదు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అనేంతగా ఆయన హోదా పెరిగిపోయింది. ప్రభాస్ ఇండియన్ స్క్రీన్ మీద ఓ అద్భుతం. దాంతొ పోటీ పడాలన్న కోరికను పెంచేసింది. ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇదంతా పక్కన పెడితే రెబెల్ స్టార్ గా కృష్ణంరాజుకు పేరు. ఆయన దాదాపుగా రెండు వందల సినిమాలు చేశారు. ఆయన దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు.

రాజ్ భవన్ వైపు చూపు….

ఇక రాజకీయాల్లో కూడా ఆయన చేరి కేంద్ర మంత్రిగా కూదా పదవులు అనుభవించారు. రెండు సార్లు ఆయన ఎంపీగా కూడా నెగ్గారు.మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కృష్ణంరాజు సీనియర్ నేత. తనకు తగిన చాన్స్ ఇస్తరేమోనని ఆయన చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మోడీ మొదటి టెర్మ్ నుంచే కృష్ణంరాజు పదవి కోసం అలా ఆశ పడుతూనే ఉన్నారు. ఈ వయసులో రాజ్ భవన్లో కూర్చోవాలన్నది పెద్దాయన కోరిక వీలుంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా చేస్తే బాగుంటుందని ఆయన తెగ ముచ్చట పడుతున్నారు. అందుకోసం ఈ మధ్య ఆయన ఏకంగా జనాల్లోకి వస్తున్నారు. స్పీడ్ పెంచుతున్నారు. మాటల దూకుడు కూడా ఎక్కువ అయింది. చంద్రబాబు మీద అయితే జైల్ కి వెళ్తారంటూ ఘాట్ కామెంట్స్ ట్శ్ చేశారు. ఇంత చేసినా మోడీ, షా మాత్రం ఆయన్ని కరుణించడంలేదు. ఆయన కోరుకున్న గవర్నర్ పదవి ఇవ్వడంలేదు.

బాహుబలి కాడనే అలా….

ఈ మధ్యన చాలా మందిని రాజ్ భవన్ కి పంపిన బీజేపీ హై కమాండ్ కృష్ణంరాజు మీద మాత్రం దయ చూపడంలేదు. పెద్దాయన దీంతో పరేషాన్ అవుతున్నారు. అయితే ఇక్కడో విషయం ఉందిట. పైగా ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. బీజేపీలో రెండు సార్లు ఎంపీ అయి, కేంద్రంలో పదవులు వెలగబెట్టిన తరువాత కూడా 2009 ఎన్నికల నాటికి ఆ పార్టీని వదిలేసి ప్రజారాజ్యంలో చేరారు. ఇక తిరిగి మోడీ హవా మొదలు కావడంతో బీజేపీలోకి వచ్చారు. అంటే పార్టీ కష్టకాలంలో ఎపుడూ నిలబడి సేవచేయలేదని కృష్ణంరాజు మీద ఉన్న ప్రధాన ఫిర్యాదు. కృష్ణంరాజు పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసే మోడీ షా ఆయన్ని పట్టించుకోవడంలేదని అంటున్నారు. బీజేపీ కోసం ఆయన పెద్దగా పనిచేయరని, పార్ట్ టైం పొలిటీషియన్ గానే ఆయన ఉంటున్నారని హై కమాండ్ కి రిపోర్ట్ వెళ్ళిందట. పైగా ఆయనకు రాజుల్లో పట్టు కూడా ఏమీ లేదని తేలడంతో ఎందుకొచ్చిన తంటా అని పక్కన పెట్టేశారట. మొత్తానికి ప్రభాస్ బాహుబలి అయినా కృష్ణంరాజు మాత్రం బీజేపీలో బాహుబలి కాలేకపోతున్నారని సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News