సురేష్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదు..!

వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ గా పనిచేసిన కే.ఆర్.సురేష్ రెడ్డికి తెలంగాణలో మంచి గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన [more]

Update: 2019-02-25 03:30 GMT

వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ గా పనిచేసిన కే.ఆర్.సురేష్ రెడ్డికి తెలంగాణలో మంచి గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి నాలుగుసార్లు గెలిచారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయన ఆర్మూర్ నియోజకవర్గానికి మారి 2009, 2014లో ఓటమి పాలయ్యారు. ఇక, ఇటీవలి ఎన్నికల్లో ఆయన మళ్లీ కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయినా, ఆయన గతంలో ప్రాతినిథ్యం వహరించిన బాల్కొండతో పాటు, ఆర్మూరులో టీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో సురేష్ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. సురేష్ రెడ్డి ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం ఆయన వంతు కృష్టి చేశారు.

పదవి దక్కుతుందా..?

అసలు సురేష్ రెడ్డి పార్టీ మారడం వెనుక ఆయన లక్ష్యం ఏంటనేది ప్రశ్నగానే ఉంది. పోటీ కూడా చేయకుండా షరతులు లేకుండా ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అయితే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సురేష్ రెడ్డి మళ్లీ కనిపించడం లేదు. ఆయన పార్టీలో చేరినప్పుడు ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలి ఛైర్మన్ అయినా అవకాశం ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్ గా ఉన్న స్వామిగౌడ్ పదవీకాలం త్వరలో ముగుస్తుంది. ఆయన పదవీకాలం ముగిశాక ఆయన స్థానంలో సురేష్ రెడ్డిని శాసనమండలి ఛైర్మన్ చేస్తారని అంటున్నారు.

శాసనమండలి ఛైర్మన్ ఛాన్స్ లేదు

అయితే, ఇప్పటికే స్పీకర్ గా రెడ్డి సామాజకవర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పైగా ఆయనది కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే. కాబట్టి స్పీకర్ ను, శాసన మండలి ఛైర్మన్ ను ఒకే జిల్లా వారికి, ఒకే సామాజకవర్గం వారికి ఇచ్చే అవకాశం లేదు. దీంతో సురేష్ రెడ్డికి శాసనమండలి ఛైర్మన్ అయ్యే అవకాశం కోల్పోయారు. కాబట్టి సురేష్ రెడ్డికి రాజ్యసభ పదవి తప్ప ఇతర ఆప్షన్ లేదు. మరి, రాజ్యసభ అవకాశం వచ్చే వరకు సురేష్ రెడ్డి ఎదురు చూడాల్సిందే.

Tags:    

Similar News