దారి చూపుమా?

ఆయ‌న టీడీపీ మాజీ మంత్రి, ఎస్సీ వ‌ర్గానికి చెందిన విద్యావంతుడు. పూర్వాశ్రమంలో ఆయ‌న ఉపాధ్యాయుడు కూడా. వంద‌ల మందికి దారి చూపించిన గురువుగా ఆయ‌న పేరు మార్మోగింది. [more]

Update: 2020-02-21 08:00 GMT

ఆయ‌న టీడీపీ మాజీ మంత్రి, ఎస్సీ వ‌ర్గానికి చెందిన విద్యావంతుడు. పూర్వాశ్రమంలో ఆయ‌న ఉపాధ్యాయుడు కూడా. వంద‌ల మందికి దారి చూపించిన గురువుగా ఆయ‌న పేరు మార్మోగింది. అయితే, ఇప్పుడు ఆయన త‌న రాజ‌కీయాల‌కు దారి వెతుక్కోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌కీ యాలు చిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాల‌ను నాయ‌కులు ఎదుర్కొనాల్సి ఉంటుందో ఎవరూ చెప్ప‌లేని ప‌రిస్థితి. అలాంటి ప‌రిస్థితినే ఇప్పుడు టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి కొత్తప‌ల్లి శామ్యూల్ జ‌వ‌హ‌ర్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ప‌రిస్ధితిలో ఆయ‌న రెంటికీ చెడ్డ.. అన్న సామెత‌లా మారిపోయారు.

లోకల్ నేతలతో….

2014లో చంద్రబాబు పిలుపుతో రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన జ‌వ‌హ‌ర్‌ త‌ను వృత్తి రీత్యా స్థిర‌ప‌డిన ప‌శ్చిమ గోదా వ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌వ‌క‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం సాధించ‌డం.. అనంత‌రం 2017లో ఎస్సీ కోటాలో మంత్రి ప‌దవిని కూడా పొందడం తెలిసిందే. అయితే, ఆయ‌న అప్పటి నుంచి అధినేత చంద్రబాబు భ‌జ‌న‌లోనే మునిగిపోయారు. ఏం జ‌రిగినా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయ‌డం, ప్రతిపక్షాల‌పై విరుచుకుప‌డ‌డం, మీడియాలో క‌నిపించాల‌నే యావ పెంచుకోవ‌డం మామూలే అన్నట్టుగా మారిపోయింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గాన్ని దాదాపుగా ప‌క్కన పెట్టారు. కొవ్వూరులో సీనియ‌ర్లు త‌మ‌కు అస్సలు ఎమ్మెల్యే ద‌ర్శనం కూడా కావ‌డం లేద‌ని అప్పట్లో గ‌గ్గోలు పెట్టారు.

తిరువూరుకు వెళ్లినా….

మంత్రి అయ్యాక ఆయ‌న‌పై ఎక్కువ‌వ్వడం విశేషం. ఇక‌, ఆయ‌న‌పై వ్యతిరేక‌త తార‌స్థాయికి చేరింది. దీంతో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కృష్ణా జిల్లా తిరువూరు నియో జక‌వ‌ర్గానికి షిఫ్ట్ చేయాల్సి వ‌చ్చింది., ఇక్కడ ఆయ‌న పోరాడినా సొంత ప్రాంత‌మే అయినా.. ప్రజ‌లు గెలి పించ‌లేదు. దీంతో ఇప్పుడు ఇక్కడ నుంచి రాజ‌కీయాలు చేయాలంటే జ‌వ‌హ‌ర్ అంత‌గా ఇష్టప‌డ‌డం లే దు. టీడీపీకి ప‌ట్టుకొమ్మ వంటి కొవ్వూరుకే తాను వెళ్తాన‌ని ఆయ‌న అంటున్నారు. దీంతో రేపో మాపో చం ద్రబాబు ఆయ‌న‌ను కొవ్వూరు ఇంచార్జ్‌గా పంపేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే స్థానికంగా జ‌వహర్‌పై నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రయ‌త్నించారు.

అయినా అక్కడే…?

నియోజకవర్గంలో వర్గ విభేదాలను చక్కదిద్దడానికి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్చిబాబుకు అధిష్ఠానం బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే కొంత ప్రయత్నం జరిగి నా విబేధాలు సమసిపోలేదు. ఈ నేపథ్యంలో జవహర్‌ వ్యతిరేక వర్గం వారు పార్టీ నియోజకవర్గ స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. జవహర్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు మాజీ మంత్రి జవహర్‌ను దూరంగా ఉంచాలని కోరారు. దీంతో మ‌రోసారి ఇక్కడ జ‌వ‌హ‌ర్‌కు ప‌గ్గాలు అప్ప‌గించినా ప్రయోజ‌నం లేద‌ని పార్టీ ఓ నిర్ణయానికి వ‌చ్చింది. దీంతో తిరువూరులో ఉండ‌న‌ని ప‌ట్టుబ‌డుతున్న జ‌వ‌హ‌ర్‌ను ఎక్కడ నియ‌మించాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌వ‌హ‌ర్ మాత్రం ఇప్పటికే కొవ్వూరులోనే మ‌కాం వేసి అక్కడ పార్టీ ప‌గ్గాలు తీసుకునేందుకు రెడీ అయిపోయారు.

Tags:    

Similar News