కొత్తపల్లి గీత రాత ఇక మారేట్లులేదుగా?

కొత్తప‌ల్లి గీత‌. ప్రస్తుతం దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన పేరు. 2014లో అర‌కు ఎంపీగా వైసీపీ టికెట్‌పై విజయం సాధించిన కొత్తప‌ల్లి గీత‌ క‌నీసం జ‌గ‌న్‌కు మొహం కూడా [more]

Update: 2021-03-20 09:30 GMT

కొత్తప‌ల్లి గీత‌. ప్రస్తుతం దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన పేరు. 2014లో అర‌కు ఎంపీగా వైసీపీ టికెట్‌పై విజయం సాధించిన కొత్తప‌ల్లి గీత‌ క‌నీసం జ‌గ‌న్‌కు మొహం కూడా చూపించ‌కుండా.. తిరుగుబాటు బావుటా ఎగ‌రేసిన నాయ‌కురాలు. త‌ర్వాత కాలంలో అప్పటి అధికార పార్టీ టీడీపీతో చెలిమి చేయాల‌ని అనుకున్నా.. ప‌రిస్థితులు అనుకూలించ‌క దూరంగా ఉండిపోయారు. ఇక‌, త‌ర్వాత ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. త‌న‌తో పాటు కొంద‌రిని పార్టీలో చేర్చుకుని టికె‌ట్లు కూడా ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో వెంట‌నే వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పుడైనా కుదురుగా…?

ఇంత వ‌రకు బాగానే ఉంది. మ‌రి ఇప్పుడు ఏం చేస్తున్నారు ? బీజేపీలో అయినా కుదురుగా ఉన్నారా ? రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉన్నారా ? అంటే.. అసలు ఆమె బీజేపీలో ఉన్నట్టు ఆ పార్టీ నేత‌ల‌కే క్లారిటీ లేకపోవ‌డం చిత్రంగా ఉంది. తాజాగా ఏపీలో బీజేపీ ఎద‌గాల‌ని భావిస్తోంది. ఇత‌ర పార్టీల్లో గ‌తంలో ఓ వెలుగు వెలిగిన వారిని.. మాజీల‌కు కండువాలు క‌ప్పేస్తోంది. ముఖ్యంగా గిరిజ‌న నాయ‌కుల కోసం పార్టీ నేత‌లు ఎదురు చూస్తున్నారు. ఇత‌ర పార్టీల్లో ప్రయార్టీ లేకుండా ఎవ‌రు ఖాళీగా ఉన్నారో ? చూస్తూ వాళ్లకు కాషాయ కండువాలేస్తోంది.

పార్టీలోనే ఉన్నారా…?

ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఉన్న అర‌కు మాజీ ఎంపీ కొత్తప‌ల్లి గీత పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఎవ‌రూ ఆమెకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కాదుకాదు.. అస‌లు ఆమే ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేదు. కొన్నాళ్లు కేంద్రంలో చ‌క్రం తిప్పుతాన‌ని.. కొన్నాళ్లు రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతాన‌ని ప్రక‌టించుకున్న ఈ లేడీ ఫైర్ బ్రాండ్‌… కొత్తప‌ల్లి గీత‌ గతంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసి.. హైద‌రాబాద్‌లో ల్యాండ్ వివాదంలో పీక‌ల్లోతు చిక్కుకున్నారు. ఈ వివాదం నుంచి బ‌య‌ట ప‌డేందుకే ఆమె బీజేపీ పంచ‌న చేరార‌నే ప్రచారం కూడా ఉంది.

పరాజయం తర్వాత….

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. ఇప్పటి వ‌ర‌కు మ‌ళ్లీ కొత్తప‌ల్లి గీత‌ లైవ్‌లోకి ఏ సంద‌ర్భంలోనూ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అస‌లు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి లాంటోళ్లే బీజేపీకి ప‌ట్టడం లేదు. ఇక కొత్తప‌ల్లి గీత‌ను ప‌ట్టించుకునే తీరిక రాష్ట్ర నాయ‌క‌త్వానికే ఉండ‌క‌పోవ‌చ్చు. ప్రస్తుతం మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనూ ఆమె పేరు, ఊరు ఎక్కడా వినిపించ‌డం లేదు. దీనిని బ‌ట్టి కొత్తప‌ల్లి గీత‌ రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నార‌ని భావించాలా? లేక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఏమైనా ఆశ‌లు ఉన్నాయ‌ని అనుకోవాలా ? అన్నది తెలియ‌ట్లేదు.

Tags:    

Similar News