ఉన్నా లేనట్లే…. అసలు ఉన్నారా?

తెలుగుదేశం పార్టీ ఏపీలో పరిస్థితి దయనీయంగా ఉంది. నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాలకు ముందుకు రావడం లేదు. అందులో ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నేతల్లో ఒకిరద్దరు నేతలు [more]

Update: 2020-11-16 08:00 GMT

తెలుగుదేశం పార్టీ ఏపీలో పరిస్థితి దయనీయంగా ఉంది. నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాలకు ముందుకు రావడం లేదు. అందులో ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నేతల్లో ఒకిరద్దరు నేతలు మినహా ఎవరూ యాక్టివ్ గా లేరు. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదవుతుండటం ఒక భయమైతే, మరొక కారణం విశాఖకు పరిపాలన రాజధాని ప్రకటించడం కూడా టీడీపీ నేతలు యాక్టివ్ గా లేకపోవడానికి కారణమంటున్నారు. ఇందులో రాజాం నియోజకవర్గానికి చెందిన కొండ్రు మురళి ఒకరు.

పట్టున్న నేత అయినా….

కొండ్రు మురళి యువనాయకుడు. ఆయనకు రాజాం నియోజకవర్గంలో పట్టుంది. నియోజకవర్గం ఏర్పాటైన 2009లో తొలిసారి ఎమ్మెల్యే కొండ్రుమురళి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొండ్రుమురళి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు కొండ్రు మురళి టీడీపీ కండువా కప్పుకున్నారు.

టీడీపీలో లేచి..దూరంగా…..

2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండ్రుమురళి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన రాజాం నియోజకవర్గం వైపు చూడటం లేదు. ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో పాటు జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను కొండ్రు మురళి స్వాగతించారు. పార్టీ నిర్ణయాన్ని థిక్కరించారు. అయినా చంద్రబాబు కొండ్రుమురళిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయననే రాజాం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు.

తప్పించాలని……

తాజాగా చంద్రబాబు ప్రకటించిన అనేక పదవుల్లో కొండ్రు మురళికి స్థానం దక్కలేదు. ఆయనను ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పిస్తారన్న టాక్ పార్టీలో వినపడుతుంది. రాజాం నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవల చంద్రబాబుకు కొండ్రు మురళి పై ఫిర్యాదు చేశారు. తమకు నాయకత్వం వహించేది ఎవరని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు కొండ్రుమురళిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారని చెబుతున్నారు. అక్కడ కొత్తనాయకత్వానికి బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News