అంచనాలు తారుమారయ్యాయా?

కొన్నిసార్లు అంతే తాము అనుకున్నవి రాజకీయాల్లో తారుమారవుతుంటాయి. తాము ఊహించని విషయాలు జరుగుతాయి. అంచనాలు కూడా తారుమారవుతాయి. సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విషయంలో ఇదే [more]

Update: 2021-07-10 09:30 GMT

కొన్నిసార్లు అంతే తాము అనుకున్నవి రాజకీయాల్లో తారుమారవుతుంటాయి. తాము ఊహించని విషయాలు జరుగుతాయి. అంచనాలు కూడా తారుమారవుతాయి. సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన ఆయన అక్కడ ఇమడ లేక పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కాంగ్రెస్ ను వీడి….

కొండా విశ్వేశ్వర్ రెడ్డి బలమైన నాయకుడు. ఆయన ఆర్థికంగా, సామాజికంగా ప్రభావితం చేయగలిగిన నేత. ఆయన కుటుంబ నేపథ్యం కూడా అదే. అలాంటి నేత కాంగ్రెస్ లో ఎక్కువ కాలం ఇమడలేక పోయారు, గ్రూపు తగాదాలకు విసిగిపోయారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అని భావించారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే తమ రాజకీయ జీవితం కూడా నాశనం అవుతుందని భావించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు.

రేవంత్ కు ఇవ్వాలని….

కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతదారు. టీఆర్ఎస్ లో 2014లో గెలిచి అక్కడ కేసీఆర్ తీరుకు హర్ట్ అయి బయటకు వచ్చారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి అయితేనే బెటర్ అని ఆయన నమ్మేవారు. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ రాదన్నది ఆయనకు అర్థమయి బయటకు వచ్చారంటారు. కాంగ్రెస్ లో బలమైన లాబీయింగ్ పనిచేస్తుందని భావించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కదనే అనుకున్నారు.

త్వరలోనే రీఎంట్రీ….

కానీ కాంగ్రెస్ ను వీడినా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరలేదు. హుజూరాబాద్ లో మాత్రం ఈటల రాజేందర్ కు మద్దతిస్తానని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఆయన మనసు మారిందంటున్నారు. తిరిగి కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. త్వరలో రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని కలసి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది. మొత్తం మీద కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఖాయమంటున్నారు.

Tags:    

Similar News