ఈయన కూడా వెళితే ఇక అయినట్లే?

ఆయనకు కాంగ్రెస్ తో పెద్దగా అనుబంధమేదీ లేదు. టీఆర్ఎస్ లో ఒకసారి ఎంపీగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ను వీడాలనుకున్నా ఆయనకు [more]

Update: 2020-11-30 09:30 GMT

ఆయనకు కాంగ్రెస్ తో పెద్దగా అనుబంధమేదీ లేదు. టీఆర్ఎస్ లో ఒకసారి ఎంపీగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ను వీడాలనుకున్నా ఆయనకు పెద్దగా ఇబ్బంది కాదు. ఆయనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. పారిశ్రామిక వేత్త కుటుంబం నుంచి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీ లో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్ఎస్ నుంచి….

కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే టీఆర్ఎస్ అధిష్టానంతో పడని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ లో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. కొండా కుటుంబానికి మంచి పేరు ఉండటంతో బీజేపీ ఆయనను తనవైపునకు లాక్కోవాలని ప్రయత్నిస్తుంది.

ఆ సమావేశంలో….

ీఈ మేరకు ఇటీవల బీజీపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డితో సమావేశమయ్యారు. బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తనకు కొంత సమయం కావాలని, అనుచరులు, కుటుంబ సభ్యులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఆయన బీజేపీవైపునకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కాంగ్రెస్ లో ఉండి కూడా….

రాష‌్ట్రంలో కాంగ్రెస్ కు నాయకత్వ సమస్య ఉండటం, జాతీయ స్థాయిలో కూడా పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరుకోవడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండేందుకు ఇష్టపడటం లేదట. బీజేపీలో ఉంటే తిరిగి ఎంపీగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు కూడా నచ్చ చెబుతున్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వ్యాపారాలు కూడా ఉండటంతో బీజేపీ సేఫ్ ప్లేస్ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భావిస్తున్నారు.

Tags:    

Similar News