Konathala : కొణతాలకు బిగ్ ఆఫర్… మరి ఓకే చెబుతారా?

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతలకు ఇబ్బందులు తప్పవు. కొన్ని కఠిన నిర్ణయాలను చంద్రబాబు తీసుకుంటాంటున్నారు. కొందరి సీనియర్లను పార్టీలోకి తీసుకు రావడం, మరికొందరిని పక్కన పెట్టడం [more]

Update: 2021-10-31 12:30 GMT

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతలకు ఇబ్బందులు తప్పవు. కొన్ని కఠిన నిర్ణయాలను చంద్రబాబు తీసుకుంటాంటున్నారు. కొందరి సీనియర్లను పార్టీలోకి తీసుకు రావడం, మరికొందరిని పక్కన పెట్టడం వంటి చర్యలు చంద్రబాబు తీసుకుంటున్నారు. అందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పక్కన పెట్టి ఆయన స్థానంలో కొణతాల రామకృష్ణకు చంద్రబాబు టిక్కెట్ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

పీలాను పక్కన పెట్టి….

నిజానికి అనకాపల్లి ప్రాంతం పీలా గోవింద సత్యనారాయణది కాదు. పెందుర్తి నియోజకవర్గం. అనకాపల్లికి వలస వచ్చారు. ఆయన 2014లో అనకాపల్లి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014 నుంచి టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారసుల ఆధిపత్యం ఎక్కువ కావడం, భూ ఆక్రమణలు ఆరోపణలు రావడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్ నాధ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

కొణతాల ను చేర్చుకునేందుకు…

అయితే ఈసారి అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను చంద్రబాబు బరిలోకి దింపాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కొణతాల రామకృష్ణ ఏ పార్టీలోనూ లేరు. ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఉద్యమనేతగానే వ్యవహరిస్తున్నారు. కొణతాల రామకృష్ణ 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో జగన్ పార్టీ నుంచి ఆయన కుమారుడు కొణతాల రఘునాధ్ పోటీ చేసి ఓడిపోయారు. కొణతాల రామకృష్ణ తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చారు.

బలం పెరుగుతుందని….

దీంతో సీనియర్ నేతలతో పాటు పట్టున్న, ప్రభావం చూపగల నేతలను చంద్రబాబు పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగా కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు. పార్టీలో చేరితే ఆయనకు గాని, ఆయన కుమారుడికి గాని అనకాపల్లి సీటు రిజర్వ్ చేస్తామన్న హామీని చంద్రబాబు ఇచ్చినట్లు తెలిసింది. కొణతాల రామకృష్ణ పార్టీలోకి వస్తే అనకాపల్లి మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News